Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

2025కి వినూత్న రీతిలో స్వాగతం పలికిన రైల్వే ఉద్యోగులు..!

  • ఓ రైల్వే స్టేషన్‌లో ఆకట్టుకున్న న్యూఇయర్ సెలబ్రేషన్స్
  • సరిగ్గా అర్ధరాత్రి 00:00 గంటల సమయంలో హారన్లు మోగించిన పైలట్లు
  • హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన ప్యాసింజర్లు, రైల్వే ఉద్యోగులు

తీపి, చేదు జ్ఞాపకాలతో 2024 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది. బుధవారం నుంచి నూతన ఏడాది 2025 ఆరంభమైంది. ప్రపంచవ్యాప్తంగా యువత గ్రాండ్‌గా కొత్త ఏడాదికి ఘనస్వాగతం పలికారు. ఇక మన దేశంలో కూడా న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందడిగానే జరిగాయి. కొందరు ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు చేసుకోగా, మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి కేక్‌లు కట్‌ చేసి వేడుకలు చేసుకున్నారు. ఇక, విధుల్లో ఉన్న భారతీయ రైల్వే ఉద్యోగులు కూడా తమకు సాధ్యమైన రీతిలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. 

రైల్వే ప్లాట్‌ఫామ్‌పై న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు, రైలు పైలట్లు చాలా ఉత్సాహంగా 2025కి స్వాగతం పలికారు. అర్ధరాత్రి సరిగ్గా 00:00 గంటలకు పైలట్లు రైలు హారన్లను కొద్దిసేపు ఏకధాటికి మోగించారు. దీంతో ప్లాట్‌ఫామ్‌పై ప్యాసింజర్లు కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. 

ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. రైల్వే ఉద్యోగుల న్యూఇయర్ వేడుక గూస్‌బంప్స్ తెప్పించిందని ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు. 2025కి అద్భుతంగా స్వాగతం పలికారని కొందరు అభివర్ణించారు. ఇదొక స్ఫూర్తిదాయకమైన వేడుక అని, అక్కడ ఉన్న అందరినీ ఐక్యం చేసిందని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. కాగా, ఈ సెలబ్రేషన్స్ ఏ రైల్వే స్టేషన్‌లో జరిగాయనేది తెలియరాలేదు.

Related posts

దుప్పటి విషయంలో తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు!

Ram Narayana

రూ.295 కట్ చేశారని ఏడేళ్లపాటు బ్యాంక్ తో ఫైట్ చేసిన కస్టమర్!

Ram Narayana

లండన్ లో జనాలను పరేషాన్ చేస్తున్న పక్షి..

Ram Narayana

Leave a Comment