Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

సంక్రాంతికి స్పెషల్ బస్సుల సంఖ్యను మరింత పెంచిన ఏపీఎస్ఆర్టీసీ!

  • తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి
  • 7,200 స్పెషల్ బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
  • ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని వెల్లడి
  • అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉంటుందని వివరణ

సంక్రాంతి సీజన్ వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో హడావిడి మామూలుగా ఉండదు. ప్రయాణాలు ఊపందుకుంటాయి. ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీలు వేల సంఖ్యలో అదనపు బస్సులు వేసినా, ప్రయాణికుల రద్దీ ఏమాత్రం తగ్గదు. ఈ నేపథ్యంలో, ఏపీఎస్ఆర్టీసీ ఈ సంక్రాంతికి బస్సుల సంఖ్యను మరింత పెంచింది. 7,200 స్పెషల్ బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. 

తెలంగాణ, ఇతర పొరుగు రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో స్పెషల్ బస్సులు నడపనున్నారు. సంక్రాంతి స్పెషల్ బస్సులు జనవరి 8 నుంచి 13వ తేదీవరకు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. 

హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు 375 బస్సులు, విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు. ఇక తిరుగు ప్రయాణానికి ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. 

ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఒకేసారి రానుపోను టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ లభిస్తుందని వెల్లడించింది. ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యం ఉంటుందని తెలిపింది.

Related posts

కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలుకు సమయం కోరిన ఏపీ… తోసిపుచ్చిన ట్రైబ్యునల్

Ram Narayana

హైదరాబాద్‌ ఉత్తరాన మరో ఎయిర్‌పోర్టు.. వచ్చే నెలలో పనుల ప్రారంభానికి సన్నాహాలు!

Ram Narayana

మీ లాభాల కోసం బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలా?: టీడీపీ ఎమ్మెల్యే బండారు

Ram Narayana

Leave a Comment