- ఏకాంతం, స్వీయ అధ్యయనం కోసం కొంత సమయం కావాలన్న సీఈసీ
- రిటైర్మెంట్ తర్వాత హిమాలయాలకు వెళతానన్న రాజీవ్ కుమార్
- ఏబీసీడీలను ఆరో తరగతిలోనే నేర్చుకున్నానన్న సీఈసీ
రిటైర్మెంట్ తర్వాత తనకు కొంచెం ఏకాంతం, స్వీయ అధ్యయనం కోసం కొంత సమయం కావాలని, ఇందుకోసం అందరికీ దూరంగా వెళతానని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. రిటైర్మెంట్ తర్వాత హిమాలయాలకు వెళ్లి నాలుగైదు నెలలు అక్కడే ఉంటానన్నారు. అనవసర అంశాల నుంచి పూర్తి విముక్తి పొందుతానన్నారు.
తాను మున్సిపల్ స్కూల్లో చదువుకున్నానన్నారు. ఏబీసీడీలను ఆరో తరగతిలో నేర్చుకున్నానని ఆసక్తికర విషయాలు చెప్పారు. అందుకే అణగారిన వర్గాల చిన్నారులకు బోధించడం తనకు ఇష్టమన్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈరోజు ప్రకటించిన విషయం తెలిసిందే.