తెలంగాణ వార్తలు

రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటన ఖరారు!

  • ఈ నెల 27న తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్, ఖర్గే
  • ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్ అగ్ర నేతలు
  • రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందంటూ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో నిర్వహించనున్న ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు. 

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ లేఖ రాశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం విస్తృతమైన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.

Related posts

దీపావళి ఎఫెక్ట్… హైదరాబాద్ లోని సరోజిని కంటి ఆసుపత్రికి పెరిగిన రద్దీ

Ram Narayana

ఈనెల 4 వ తేదీన తుంగతుర్తిలో మాజీమంత్రి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు..

Ram Narayana

ఆర్టీసీ బస్‌పాస్‌ చార్జీల పెంపుపై ఆందోళన : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌!

Ram Narayana