సంక్రాంతి వేళ ఏపీ సీఎం చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, నటుడు బాకృష్ణలతో కూడిన ఫ్లెక్సీ నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రబాబు ఫొటో కింద ‘బాస్ ఈజ్ బ్యాక్’, బాలయ్య ఫొటో కింద ‘డాకు మహారాజ్’, కేసీఆర్ ఫొటో కింద ‘బాస్ ఈజ్ కమింగ్ సూన్’ అని రాయడం జరిగింది.
ఈ ఫ్లెక్సీలో కేటీఆర్, మంత్రి నారా లోకేశ్, జూనియర్ ఎన్‌టీఆర్, మోక్షజ్ఞ ఫొటోలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులో ఉండే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురంలో కల్లూరు టు తిరువూరు రోడ్ పక్కన ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. చూపరులను వెంటనే ఈ ఫ్లెక్సీ ఆకర్షిస్తుంది . అటుగా వెళ్లిన కొందరు ఈ పోస్టర్‌ను ఫొటో తీసి, నెట్టింట పెట్టడంతో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.