Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీ-ఆర్ఎస్ఎస్‌గా మారిందన్న సీఎం రేవంత్ రెడ్డి …

తెలంగాణలో చట్టబద్ధమైన పాలన సాగుతోంది

  • తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీ-ఆర్ఎస్ఎస్‌గా మారిందని ఎద్దేవా
  • బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకే వైఖరితో ఉన్నాయని విమర్శ
  • సొంత పార్టీ కార్యాలయ నిర్మాణానికి కాంగ్రెస్‌కు ఇన్నాళ్లు పట్టిందన్న సీఎం

తెలంగాణలో చట్టబద్ధమైన పాలన సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ‘ఇందిరా భవన్’ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవం కోసం ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీ-ఆర్ఎస్ఎస్‌గా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ వైఖరి ఒకేరకంగా ఉన్నాయన్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ కూడా ఆరెస్సెస్ అడుగుజాడల్లో నడిచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌పై బీజేపీ ఏ ఆరోపణలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ అవే ఆరోపణలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రమూ లేదన్నారు.

40 ఏళ్ల రాజకీయ పార్టీ బీజేపీ, ఎన్నో ప్రాంతీయ పార్టీలు అతి తక్కువ కాలంలోనే ఢిల్లీలో సొంత కార్యాలయాలు నిర్మించుకున్నాయని, కానీ 140 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయం నిర్మించుకోవడానికి ఇన్నేళ్లు పట్టిందన్నారు. ప్రజల కోసం నిస్వార్థంగా పని చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు, కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో గుర్తించాలన్నారు.

Related posts

కులగణనలో కేసీఆర్ ,కేటీఆర్ , హరీష్ రావు పాల్గొనకపోతే సామజిక బహిష్కరణ..రేవంత్ రెడ్డి

Ram Narayana

పక్కనున్న వాళ్లు తనను ఫినిష్ చేయకుండా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాలి: హరీశ్ రావు

Ram Narayana

కొత్తగూడంలో ఎంపీ వద్దిరాజు హంగామా …వనమాకు మద్దతుగా 500 కార్ల తో భారీ ర్యాలీ …

Ram Narayana

Leave a Comment