Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు!

  • ఖలిస్థానీ సానుభూతిపరులు దాడి చేసే అవకాశముందని నిఘా వర్గాల సమాచారం
  • అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పరిశీలిస్తున్న ఢిల్లీ పోలీసులు
  • దేవుడిపై ఉన్న విశ్వాసమే తనను కాపాడుతుందన్న కేజ్రీవాల్

ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాక్ ఐఎస్ఐ మద్దతుతో ఖలిస్థానీ సానుభూతిపరులు ఆయనపై దాడి చేసేందుకు కుట్ర పన్నారని ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.

దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను సమీక్షించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని వస్తున్న వార్తలపై కేజ్రీవాల్ స్పందించారు. దేవుడిపై తనకు ఉన్న విశ్వాసమే తన ప్రాణాలను కాపాడుతుందన్నారు.

Related posts

అసోంలోని ఆ గ్రామమంతా ఒకే కుటుంబం… 1200 మంది ఓటర్లు ఉన్నారు!

Ram Narayana

ఏపీపై కేంద్రం కరుణ..ఒకేసారి రూ.10,461 కోట్ల నిధుల మంజూరు…

Drukpadam

డేంజర్ మార్కును దాటేసిన యమున.. ముప్పు ముంగిట్లో ఢిల్లీ

Ram Narayana

Leave a Comment