జాతీయ వార్తలు

ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్… 11 మంది నక్సల్స్ మృతి

  • మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ
  • బీజాపూర్ జిల్లాలో కాల్పుల మోత
  • నేటి ఉదయం 9 గంటల నుంచి ఎదురుకాల్పులు

ఇటీవల కాలంలో ఛత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్లతో నక్సల్స్ కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల ఘటనలో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. 

బీజాపూర్ జిల్లా బారేడుబాక అటవీ ప్రాంతం వద్ద భద్రతా దళాలకు, నక్సల్స్ కు మధ్య కాల్పులు జరిగాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపడుతున్న సంయుక్త భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ ఉదయం 9 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఘటన స్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Related posts

హైపర్ సోనిక్ క్షిపణులతో పాక్ డేంజర్ గేమ్.. బంగ్లాలో అస్థిరతపై శశి థరూర్ సీరియస్ వార్నింగ్!

Ram Narayana

మరిన్ని చిక్కుల్లో కేరళ కాంగ్రెస్ నేత.. తీవ్ర ఆరోపణలు చేసిన ట్రాన్స్‌జెండర్!

Ram Narayana

కరూర్ తొక్కిసలాటకు విజయ్ ఆలస్యంగా రావడమే కారణం …పోలిసుల ఎఫ్ ఐ ఆర్ …

Ram Narayana