Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

‘సీతక్కతో విభేదాలు’ ప్రచారంపై స్పందించిన కొండా సురేఖ…

  • సీతక్కతో ఎలాంటి విభేదాలు లేవన్న కొండా సురేఖ
  • అభివృద్ధిలో ఇద్దరం భాగస్వాములమవుతామన్న మంత్రి
  • ఇద్దరం ఎక్కువగా కలుసుకోవడం కష్టమేనన్న సురేఖ

సహచర మంత్రి సీతక్కతో ఎలాంటి విభేదాలు లేవని, తాము సమ్మక్క సారక్కల్లా కలిసిమెలిసి ఉంటామని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇరువురు మంత్రులు నిన్న ఒకే వేదిక పైకి వచ్చారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ సమయంలో తమ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారాన్ని తిప్పికొట్టారు. అభివృద్ధిలో తామిద్దరం భాగస్వాములమవుతామని సురేఖ అన్నారు.

సీతక్క, సురేఖ… ఒకటిగా ఉంటారని, అలాగే ప్రజలూ తమ వెంట ఉంటారన్నారు. సీతక్క ఎక్కువగా ఏజెన్సీలో పర్యటిస్తుందని, తాను నగరంలో పర్యటిస్తుంటానని, కాబట్టి ఇద్దరం కలుసుకోవడం కష్టమన్నారు. పరస్పర అవగాహనతో జిల్లా అభివృద్ధిపై ముందుకు సాగుతామన్నారు.

Related posts

బూర్జువా పార్టీలకు ముళ్లకర్ర సీపీఐ (ఎం)…బివి రాఘవులు

Ram Narayana

రేవంత్ రెడ్డీ! నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లి సరైన స్థానంలో ఉంటుంది: కేటీఆర్

Ram Narayana

బీఆర్ యస్ ఖాళీ కానున్నదా…నిజంగానే 26 మంది ఎమ్మెల్యేలు అందులో చేరుతున్నారా …?

Ram Narayana

Leave a Comment