ఫిబ్రవరి 7న మాదిగల గిన్నిస్ బుక్ రికార్డుకు సన్నద్ధం
వెయ్యి గొంతుకలు… లక్ష డప్పులు ఒక చరిత్రాత్మకం
హైదరాబాద్ కు మాదిగ సోదరులు భారీగా తరలిరావాలి
మాదిగ జర్నలిస్టు ఫోరం జాతీయ ఇన్చార్జ్ తిప్పారపు లక్ష్మణ్ పిలుపు
ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో తలపెట్టిన వెయ్యి గొంతుకలు… లక్ష డప్పులు ఒక చరిత్రాత్మకం కాబోతుందని, ఈ మహా ఘట్టం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించే అవకాశం ఉందని మాదిగ జర్నలిస్టు ఫోరం జాతీయ ఇన్చార్జ్ తిప్పారపు లక్ష్మణ్ పేర్కొన్నారు. కోణార్క్ హోటల్లో శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా మాదిగ జర్నలిస్టుల ఫోరం ఆత్మీయ సమావేశం చెరుకుపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిప్పారపు లక్ష్మణ్ మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణను అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా తెలంగాణలో అమలు చేయడం లేదని, అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణలో అమలు చేసి చూపిస్తామని చెప్పి ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు దశాబ్దాలుగా మాదిగ జాతి అడుగడుగునా అనేక అవరోధాలు ఎదుర్కొంటూ వస్తున్నారని, మాదిగలకు న్యాయం చేయాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరింత అవమానాలకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎం జె ఎఫ్ జాతీయ అధ్యక్షులు మాతంగి దాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఫిబ్రవరి 7న జరిగే
వెయ్యి గొంతుకలు… లక్ష డప్పుల కార్యక్రమం కానీ విని ఎరగని రీతిలో జరగబోతుందని, ప్రతి మాదిగ బిడ్డ భుజాన డప్పు వేసుకొని హైదరాబాద్ కు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. చేతికి అందే ఫలాలు కొందరు వ్యక్తులు అందకుండా అడ్డుపడుతున్నారని, ఎవరెన్ని ఆటంకాలు సృష్టించిన అంతిమ విజయం మందకృష్ణ మాదిగ దేనిని అన్నారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించిన దానిని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని, ఫిబ్రవరి 7న జరిగే లక్ష డప్పుల వెయ్యి గొంతుకల కార్యక్రమం కనువిప్పు కాబోతుందని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం లక్షలాదిగా హైదరాబాద్ కు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మహాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ సుంచు అశోక్. మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గాదే రమేష్, జాతీయ కార్యదర్శి చాటింపు అశోక్, జాతీయ సలహాదారుడు గుంజలూరి దేవేందర్, నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీందర్ ,రాష్ట్ర నాయకులు గుద్దేటి రమేష్ బాబు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీనివాసరావు. కార్యదర్శి దాన కరుణ, డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు దేవా,మట్టి దేవేందర్, శ్రీనివాస్, సైదులు, మేడి రమేష్, ప్రభాకర్ రావు, రామారావు తదితరులు పాల్గొన్నారు