ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

వైసీపీలో చేరిన శైలజానాథ్ కు డొక్కా మాణిక్య వర ప్రసాద్ కీలక సూచన!

  • వైసీపీలో విలువలు, విశ్వనీయతలు ఉండవన్న డొక్కా
  • పార్టీలో చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారని విమర్శ
  • శైలజానాథ్ వైసీపీలో చేరకపోవడమే మంచిదని సూచన

మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ… ఒక మిత్రుడిగా శైలజానాథ్ కు ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నానని… వైసీపీలో విలువలు, విశ్వసనీయతలు ఉండవని… పార్టీలో చేర్చుకునే ముందు ఎంతో ఆప్యాయంగా ఉంటారని… ఆ తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారని చెప్పారు. 

వైసీపీలో ఇప్పటికే 74 మంది నేతలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని డొక్కా అన్నారు. దళితులకు ఆ పార్టీలో విలువ ఉండదని చెప్పారు. దళితులకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ వైసీపీ అని వ్యాఖ్యానించారు. శైలజానాథ్ కు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఆ పార్టీలో చేరకపోవడమే మంచిదని సూచించారు. 

కాగా, శైలజానాథ్ ను శింగనమల వైసీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే… ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. గత 30 ఏళ్లుగా ఇదే సెంటిమెంట్ కొనసాగుతోంది.

Related posts

తనకు టీడీపీ పాలనే నచ్చిందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందన

Ram Narayana

వైసీపీ కీలక నేత సజ్జలపై లుక్ అవుట్ నోటీస్.. ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డగింత!

Ram Narayana

టీడీపీ కార్యకర్తలపై చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Ram Narayana