సుబాబుల్ రైతులకు సరైన రేటు ఇవ్వకపోతే ఆందోళన తప్పదు… అఖిలపక్ష రైతు సంఘాల హెచ్చరిక …
మన రైతులకు కేవలం రూ10 వేల 500 ఇస్తూ విదేశాల నుంచి రూ18 వేలకు దిగుమతి
ఇదెక్కడి న్యాయమని రైతుసంఘాల నిలదీత
సిండికేట్ గా ఏర్పడి రైతులకు నష్టం చేస్తే సహించం
సుభాబుల్ జమాయిల్ ధర ను స్థిరకరించండి …
సుబాబుల్ రైతులకు సరైన రేటు ఇవ్వకపోతే ఆందోళన తప్పదని అఖిలపక్ష రైతుసంఘాలు హెచ్చరించాయి …రైతులంతా ఏకమై సిండికేట్ చర్యలపై తిరగబడక తప్పదన్నారు …ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవనంలో జరిగిన రైతు సంఘాల సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన రైతు ప్రనిధులు హాజరైయ్యారు …సమావేశంలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ రైతుల వద్దనుంచి సుభాబుల్ జమాయిల్ కొనుగోలు విషయం లో సిండికేట్ గా మారి రైతులను తీవ్రంగా నష్టపరస్తున్నారని ఆరోపించారు. అటవీ, ప్రభుత్వం వద్దనుంచి టన్ను రూ17000 లకు కొనుగోలు చేస్తున్నారని ఇతర దేశాలనుంచి రూ 18000 లకు దిగుమతి చేసుకుంటున్నారని రైతుల వద్దనుంచి కేవలం రూ10500లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నరని ఇదెక్కడి న్యాయమని అన్నారు … ఇప్పుడు ఇంకో 300 తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. సుబాబుల్ ,జామాయిల్ కొంగలు జేసే వ్యాపారాలు సిండికేట్ గా మారి దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు … ప్రభుత్వం సుబాబుల్ , జమాయిల్ ధరల తగ్గింపు పై తగు చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు . ఇదే పరిస్థితి కొనసాగితే ఆందోళన తప్పదని హెచ్చరించారు … ఈ సమావేశం లో రైతు సంఘాల నాయకులు భాగం హేమంత రావు దొండపాటీ రమేష్ కొండపర్తి గోవిందరావు అడపా రామకోటయ్య సామినేని హరిప్రసాద్ మలీదు నాగేశ్వరావు చావా కిరణ్ వేముల పల్లి సుధీర్ వట్టికొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. తిరిగి ఈ నెల 19వ తేదీన సమావేశమై కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు..