క్రైమ్ వార్తలు

సికింద్రాబాద్ లోని అశోకా హోటల్ కు బాంబు బెదిరింపు కాల్!

  • రైల్వే స్టేషన్ సమీపంలో కలకలం
  • డాగ్ స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు
  • అనుమానాస్పద వస్తువులు ఏవీ దొరకలేదని వెల్లడి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని అశోకా హోటల్ లో బుధవారం రాత్రి కలకలం రేగింది. హోటల్ లో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో టెన్షన్ నెలకొంది. దీంతో స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు, స్టేషన్ చుట్టుపక్కల ఉన్న చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హోటల్ లో ఉన్న వారందరినీ బయటకు పంపించారు. చుట్టుపక్కల బందోబస్తు ఏర్పాటు చేసి అటువైపు ఎవరినీ అనుమతించలేదు.

డాగ్ స్క్వాడ్ ను రప్పించి హోటల్ మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, బాంబు కానీ మరే ఇతర అనుమానాస్పద వస్తువులు కానీ దొరకలేదని చెప్పడంతో హోటల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. బాంబు బెదిరింపు ఆకతాయి పనేనని తేలడంతో స్టేషన్ చుట్టుపక్కల ఉన్న చిరు వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

ముంబైలో కిడ్నాపైన బాలుడు.. ఏడాది తర్వాత జగ్గయ్యపేటలో గుర్తింపు!

Drukpadam

అత్యాచార యత్నాన్ని అడ్డుకున్న యువతి.. రాయితో కొట్టి చంపిన కామాంధుడు!

Ram Narayana

యూపీలో షాకింగ్ ఘ‌ట‌న‌.. ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ను వ‌దిలేసి బిచ్చ‌గాడితో పారిపోయిన మ‌హిళ‌!

Ram Narayana