అంతర్జాతీయంప్రమాదాలు ...

రెండు బస్సులు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 37 మంది దుర్మరణం…

  • బొలీవియాలోని పొటోసీలో ఘటన 
  • మరో 39 మందికి గాయాలు
  • అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు

బొలీవియాలోని పొటోసీ ప్రాంతంలో రెండు బస్సులు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 37 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉయుని, కొల్చాని రహదారిపై ప్రయాణిస్తున్న రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు ఒక బస్సు లోయలోకి దూసుకెళ్లింది.

సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

Related posts

వైట్‌హౌస్‌కు బంగారు మెరుగులు.. సొంత ఖర్చుతో అలంకరిస్తున్న ట్రంప్!

Ram Narayana

గ్రహాంతర జీవులు ఉన్నాయా? అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఏమన్నారంటే?

Ram Narayana

చైనాతో కీలక ఒప్పందం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

Ram Narayana