జాతీయ వార్తలు

చర్లపల్లి నుంచి చెన్నై, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లు


హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి నడిచే రెండు రైళ్ల ప్రారంభ స్థానాన్ని మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. చెన్నై సెంట్రల్-హైదరాబాద్ (12603), హైదరాబాద్-చెన్నై సెంట్రల్ (12604), గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ (12589), సికింద్రాబాద్- గోరఖ్‌పూర్ (12590) రైళ్లు ఇకపై చర్లపల్లి కేంద్రంగా నడవనున్నాయి.

దీంతో ఈ రైళ్లను ఇకపై చెన్నై సెంట్రల్-చర్లపల్లి, చర్లపల్లి-చెన్నై సెంట్రల్, గోరఖ్‌పూర్-చర్లపల్లి, చర్లపల్లి-గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా వ్యవహరిస్తారు. చర్లపల్లి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు నిన్నటి నుంచే చర్లపల్లి నుంచి ప్రయాణం ప్రారంభించగా, గోరఖ్‌పూర్ నుంచి చర్లపల్లి, చర్లపల్లి నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే రైళ్ల విషయంలో మాత్రం 12, 13వ తేదీల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

Related posts

తనకంటే అందంగా ఉన్నారని ముగ్గురు బాలికల హత్య.. మహిళ!

Ram Narayana

జడ్జి నివాసంలో నోట్ల కట్టలు… కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు!

Ram Narayana

వచ్చే సెప్టెంబర్ నెలలో దేశంలో జనగణన ప్రారంభం?

Ram Narayana