పహల్గాంల ఉగ్రదాడి నేపధ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పాకిస్థాన్ సహకరించాలని సూచించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సరి హద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. అందుకే వాన్స్ ఒక ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. భారత్ తనదైన ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలి. కానీ.. అది ప్రాంతీయ యుద్ధానికి దారి తియ్య కూడదు. పాకిస్థాన్ కూడా తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల్ని అరికట్టడానికి భారత్‌కి సహకరించాలన్నారు. ఇలా అనడం ద్వారా.. భారత్‌కి అమెరికా ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్లైంది. ఇక ఇప్పుడు భారత్.. పాకిస్థాన్ గడ్డమీద ఉగ్రవాదుల్ని లేపేయాలి అనుకుంటే.. అమెరికా అండదండలు ఉన్నట్లే భావించచ్చు. ఇది పాకిస్థాన్‌కి షాకింగ్ విషయమే. ఐతే.. భారత్ ఎలాంటి ప్లాన్‌తో ముందుకు వెళ్తుంది అనేది బయటకు చెప్పట్లేదు. దీనిపై రకరకాలుగా జనం మాట్లాడుకుంటున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: