Jaishankar
జాతీయ వార్తలు

అంత వరకూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపి వేస్తాం … విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌ అంతం చేసే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపి వేస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (Jaishankar) స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) పైనే ఆ దేశంతో చర్చలు జరుపుతామని అన్నారు. కాల్పుల విరమణ నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం నిలిపి వేతను భారత్‌ పునఃపరిశీలించాలని పాకిస్థాన్‌ కోరింది. పాక్‌ జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు భారత విదేశాంగ శాఖకు లేఖ రాసింది. కాగా, కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్‌ వినతిపై ఆయన స్పందించారు. ‘సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేశాం. విశ్వసనీయంగా, తిరిగి మార్చలేని విధంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌ ఆపే వరకు ఈ ఒప్పందం నిలిపి వేత కొనసాగుతుంది’ అని తెలిపారు. మరో వైపు పాకిస్థాన్‌తో చర్చించాల్సిన ఏకైక అంశం కశ్మీర్‌పైనే అని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్  స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో చట్ట విరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయాలి. ఆ చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.

Related posts

పూణె భూ వివాదం.. డీల్ రద్దు చేయాలన్నా రూ.42 కోట్లు చెల్లించాల్సిందే!

Ram Narayana

పనిగంటల అంశంపై కేంద్రం స్పందన…

Ram Narayana

కేరళ ఆలయ వేడుకల్లో విషాదం.. బాణసంచా పేలి 154 మందికి గాయాలు.. తొక్కిసలాట

Ram Narayana