తెలంగాణ రాజకీయ వార్తలు ..

సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి కూనంనేని …

సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కోనంనేని రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణ అసెంబ్లీ లో ఏకైక ప్రజల గొంతుక

సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కూ న0నేని సాంబశివరావు రెండవసారి ఎన్నికయ్యారు మేడ్చల్ జిల్లా గాజుల రామవరం లో మూడు రోజులపాటు జరిగిన నాలుగవ మహాసభలలో ఆయన ఎన్నికయ్యారు.  హైదరాబాద్‌లోని గాజులరామారంలో జరిగిన సీపీఐ 4వ రాష్ట్ర మహాసభల్లో ఆయన పేరును పార్టీ సీనియర్ నేత పల్లా వెంకటరెడ్డి ప్రతిపాదించగా, మరో నాయకుడు శంకర్ బలపరిచారు. దీంతో కూనంనేని వరుసగా రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

గుంటూరు జిల్లాలో జన్మించిన కూనంనేని తిరుపతిలో ప్రాథమిక విద్యను గుంటూరులో డిగ్రీ పూర్తి చేశారు విశాలాంధ్రలో ఎడిటర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు హైదరాబాదు నుంచి కొత్తగూడెం పట్టణానికి విశాలాంధ్ర విలేకరిగా వచ్చారు. పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ సిపిఐ పట్టణ కార్యదర్శి గా ఎన్నికయ్యారు. 1987లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో కొత్తగూడెం ఎంపీపీగా ఎన్నికయ్యారు కొత్తగూడెం డివిజన్ పార్టీ కార్యదర్శిగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులుగా కూనంనేని పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు సిపిఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు .2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రెండు దఫాలు పనిచేసిన ఆయన 2022లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సిపిఐ మూడవ మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి సిపిఐ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధించారు .మంచివక్త గా ఆందోళన కారుడిగా సాంబశివరావుకు పేరు ఉంది. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం పార్టీ విస్తరణే లక్ష్యంగా పని చేయనున్నట్లు తెలిపారు. సాంబశివరావు ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మహమ్మద్ మౌలానా సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్గా తిరిగి రెండోసారి ఎన్నికయ్యారు.

Related posts

నన్ను ఓడించేందుకు రూ. 300 కోట్లు పంపించారు: పొంగులేటి

Ram Narayana

ఖమ్మం జిల్లాలో కు తుమ్మల వెంట నడిచేందుకు సిద్ధపడుతున్న బీఆర్ యస్ నేతలు …!

Ram Narayana

ఖమ్మం అసెంబ్లీ పోరు …తాజా ,మాజీల మధ్య మాటల యుద్ధం ..తగ్గేదేలే అంటున్న నేతలు ..!

Ram Narayana