జాతీయ రాజకీయ వార్తలు

బీహార్ లో ఊహకందని ఫలితాలు ..లెక్కలు తప్పిన ఎగ్జిట్ పోల్స్..

బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎవరి ఊహకందని విధంగా ఫలితాలు రావడం చూసి ఇటు సర్వే సంస్థలు , అటు రాజకీయ పరిశీలకులు , చివరకు రాజకీయ పార్టీలు సైతం అవాక్కు అయ్యాయి ..ఇప్పటివరకు ఒక్క తమిళనాడులో తప్ప దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొద్దీ గొప్పతేడాతో కచ్చితమైన అంచనాలు ఇవ్వగలిగాయి …బీహార్ ఎన్నికల్లో కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకి అధికారం వస్తుందని చెప్పినప్పటికీ ఇంత పెద్ద (203 ) మొత్తంలో ఘన విజయం సాదిస్తుందని అంచనా వేయలేకపోయాయి..దీంతో ఎగ్జిట్ పోల్స్ లెక్కలు తప్పినట్లు అయింది .

ఎన్నికల ప్రచారం హోరాహోరీ గా సాగింది …ఎన్నికల ప్రకటనకు ముందునుంచే ఓటు చోరీ పేరుతో ప్రతిపక్ష కూటమి రాహుల్ గాంధీ , ఆర్జేడీ నేత తేజశ్వని యాదవ్ నాయకత్వంలో ఇతర రాజకీయ పార్టీలు కలిసి జరిపిన ర్యాలీలకు జనం పోటెత్తారు…వారిపై పూలవర్షం కురిపించారు ..ఎన్నికల ప్రచారంలో కూడా తేజశ్వని యాదవ్ సభలకు పరుగులు తీశారు …అయినా ఆ పార్టీకి కేవలం 32 ,33 సీట్లకు మించి రాకపోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది ..గత శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీకి 75 సీట్లు వచ్చాయి…ఇక కాంగ్రెస్ కు 19 నుంచి 4 సీట్లకు పడిపోయింది …లెఫ్ట్ పార్టీలు మరి ముఖ్యంగా సిపిఐ (ఎం ఎల్ ) పార్టీ కూడా ఘననీయంగా దాని ప్రభావాన్ని కోల్పోయింది ..ఎక్కడ కొట్టింది ఈ తేడా అనేది పార్టీలు పోస్టుమార్టం చేయాల్సివుంది …ఎన్నికలు ప్రకటించక ముందు వరకు ఐక్యంగా ఉన్న ప్రతిపక్షాలు సీట్ల పంపకం దగ్గరకు వచ్చే సరికి ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరించాయి .. దీంతో ఇది కొంత ప్రతికూల ప్రభావం చూపింది …ఇక చివరకు సీఎం అభ్యర్థిగా తేజశ్వని యాదవ్ ను అంగీకరించి ప్రకటించినప్పటికీ అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది …

ఇక ఎన్డీయే కూటమి ఎన్నికల్లో అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది …కూటమిలోని అన్ని పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించింది ..నితీష్ కుమార్ మా సీఎం అభ్యర్థి అని స్పష్టం చేసింది …ఎన్నికలకు కొద్దీ రోజుల ముందు ప్రతి మహిళకు 10 వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది ..దీంతో మహిళా ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు …ఎన్నికల్లో తేజశ్వని యాదవ్ ప్రతి మహిళకు 30 వేల రూపాయలు ఇస్తానని చెప్పినప్పటికీ ఆయన మాట విశ్వసించలేదు … ఇప్పటికే నాలుగు సార్లు సీఎం గా ఉన్న వ్యక్తికే మళ్ళీ బీహార్ ఓటర్లు పట్టం కట్టారు …ఈసారి జేడీయూ కు 80 పైగా స్థానాలు కట్టబెట్టారు .. బీజేపీకి 90 కి పైగా సీట్లు వచ్చాయి ..ప్రధాని నరేంద్ర మోడీ , హోమ్ మంత్రి అమిత్ షా ,సీఎం నితీష్ కుమార్ ప్రచార భాద్యతలను నెత్తికెత్తుకుని సక్సెస్ అయ్యారు ..

దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల విజయాలకు పార్టీలకు సలహాదారుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ తానెందుకు పార్టీ పెట్టి అధికారంలోకి రాకూడదని భావించారు …అందుకు అనుగుణంగా జన సూరజ్ పార్టీ పెట్టిన ఎన్నిక వ్యూహకర్త తన అట్టర్ ప్లాప్ అయ్యారు …బీహార్ రాజాజీయాల్లో కింగ్ మేకర్ అవుతానని తన ప్రమేయం లేకుండా ప్రభుత్వాలు ఏర్పడవని చెప్పిన ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు …కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఎన్నికల తర్వాత ఆయన్ను గురించి మాట్లాడతామని చెప్పారు …ఇందుకేనేమో … ఇక లెఫ్ట్ పార్టీలు గత ఎన్నికల్లో మంచి ప్రభావం చూపాయి..ఈసారి చతికల పడ్డాయి.. ముస్లిం ఓట్లను చీల్చి పర్వోక్షంగా బీజేపీకి వారి మిత్రులకు ఎం ఐ ఎం సహాయపడుతుందని విమర్శలు ఉన్నాయి..అయితే ఎం ఐ ఎం కు ఈసారి ఎంతవరకు ప్రభావం చూపింది …వారి పోటీవల్ల ఎవరికీ లాభం ,ఎవరికీ నష్టం అనేది విశ్లేషించాల్సిన అవసరం ఉంది…

బీహార్ ఎన్నికల ఫలితాలపై మోదీ, నితీశ్, జైశంకర్ ఏమన్నారంటే…!

Narendra Modi Reacts to NDA Victory in Bihar Elections
  • ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారన్న మోదీ
  • వికసిత్ భారత్‌పై విశ్వాసం పెట్టుకున్నారన్న అమిత్ షా
  • కూటమి ప్రభుత్వం పట్ల విశ్వాసంతో ప్రజలు గెలిపించారన్న జైశంకర్

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తదితరులు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. బీహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి గెలిపించాయని అన్నారు. బీహార్ అభివృద్ధికి నూతన సంకల్పంతో పని చేసేందుకు ఈ చారిత్రక విజయం మరింత శక్తినిస్తుందని అన్నారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోదీ తన సందేశాన్ని పంచుకున్నారు. “సుపరిపాలన విజయం సాధించింది. అభివృద్ధి విజయం సాధించింది. ప్రజా సంక్షేమ స్ఫూర్తి విజయం సాధించింది. సామాజిక న్యాయం విజయం సాధించింది” అని ఆయన పేర్కొన్నారు. 

“రాబోయే కాలంలో బీహార్ అభివృద్ధి కోసం మరింత చురుకుగా పనిచేస్తాం. రాష్ట్ర మౌలిక సదుపాయాలకు, సంస్కృతికి కొత్త గుర్తింపును అందిస్తాం. ఇక్కడి యువ శక్తి, మహిళా శక్తికి ఉజ్వల భవిష్యత్తు కోసం తగిన అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నాను” అని మోదీ తెలిపారు.

ఎన్డీయేకు ఈ చారిత్రక విజయాన్ని అందించిన బీహార్ ప్రజలకు ప్రధాని మోదీ ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రజా తీర్పు, ప్రజలకు సేవ చేయడానికి, బీహార్ కోసం కొత్త సంకల్పంతో పనిచేయడానికి తమకు మరింత శక్తినిస్తుందని అన్నారు. 

ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. “ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జీకి, ఎన్డీయే కుటుంబ సహచరులైన చిరాగ్ పాశ్వాన్ జీ, జితన్ రామ్ మాంఝీ జీ, ఉపేంద్ర కుష్వాహా జీలకు ఈ అద్భుత విజయానికి నా హృదయపూర్వక అభినందనలు” అని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా, ప్రతిపక్షాలు ప్రచారం చేసిన ప్రతీ అబద్ధాన్ని గట్టిగా తిప్పికొడుతూ, తమ అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఎన్డీయే కార్యకర్తల అవిశ్రాంత శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని మోదీ అన్నారు. ప్రతి కార్యకర్తను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.

ఇక, వికసిత్ భారత్‌పై విశ్వాసం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయమిదని అమిత్ షా పేర్కొన్నారు. జంగల్ రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు ఏ వేషంలో వచ్చినా వారికి దోచుకునే అవకాశం లభించదని పేర్కొన్నారు.

బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయే కూటమికి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. అపూర్వ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మోదీ, నితీశ్ తదితరులకు అభినందనలు తెలియజేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ సారథ్యంలోనే బీహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు.

మోదీ, నితీశ్ ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ విధానాలపై ప్రజల నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని జేపీ నడ్డా పేర్కొన్నారు. జంగల్ రాజ్, అవినీతిని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. సుపరిపాలన, సుస్థిరత, అభివృద్ధికి ఓటు వేశారని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పట్ల విశ్వాసంతో ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పేర్కొన్నారు. తమకు అపూర్వ విజయాన్ని అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ప్రధానమంత్రి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి మద్దతుతో బీహార్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

 బీహార్ ఫలితాలు నిజంగా ఆశ్చర్యపరిచాయి.. అందుకే మేం ఓడిపోయాం: రాహుల్ గాంధీ

Rahul Gandhi Reacts to Bihar Election Results
  • బీహార్ ఎన్నికలు మొదటి నుంచి న్యాయంగా జరగలేదన్న రాహుల్ గాంధీ
  • రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడుతున్నామన్న కాంగ్రెస్ నేత
  • బీహార్‌లో 61 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. బీహార్‌లో ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బీహార్ ఎన్నికలు మొదటి నుంచి న్యాయంగా జరగలేదని ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే తమ పార్టీ ఓటమి పాలైందని తెలిపారు.

రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు తాము పోరాడుతున్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఫలితాలను సమీక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జరుగుతున్న పోరాటమని ఆయన వ్యాఖ్యానించారు. మహాఘట్‌బంధన్‌పై విశ్వాసం ఉంచి ఓటు వేసిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి 200కు పైగా స్థానాలు గెలుచుకోగా, ఆర్జేడీ-కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ 34 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీకి ఇది రెండో అత్యంత దారుణ ఓటమి. 2010లో కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.

Related posts

రాజకీయంగా పోరాడడం చేతకాని వారే దర్యాప్తు సంస్థలను ఆశ్రయిస్తారు.. అభిషేక్ బెనర్జీ ఫైర్

Ram Narayana

రాహుల్ గాంధీ యాత్ర… మణిపూర్‌కు వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

బీజేపీ, జేడీయూ ఇన్నేళ్లేం చేశాయి?: ఎన్డీయే కీలక హామీపై ప్రియాంక గాంధీ ప్రశ్న!

Ram Narayana