- పాట్నాలోని గాంధీ మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- సీఎం ఎవరనేదానిపై అధికారికంగా ఇప్పటికీ వెలువడని ప్రకటన
బీహార్ లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి ఈ నెల 19 లేదా 20 వ తేదీల్లో కొలువు దీరనున్నది …అయితే సీఎం ఎవరనేదానిపై రాజకీయ పండితులు , విశ్లేషకులు చర్చోప చర్చలు పెడుతున్నా ప్రస్తుతానికైతే నితీష్ కుమారే మళ్ళీ సీఎం కానున్నారు ..ఎన్నికల సమయంలో బీజేపీ అగ్రనేత హోమ్ మంత్రి అమిత్ షా మా సీఎం అభ్యర్థి నితీష్ కుమారే అని స్పష్టం చేశారు …ఒక నితీష్ తనకు తాను తప్పుకుంటే తప్ప మరొకరికి అవకాశం ఉండదు ..లేదా బీజేపీ గట్టిగ పట్టుపడితే అప్పడు నితీష్ కూడా అంగీకరించే అవకాశం ఉంటుంది ..అయితే కొద్దికాలం మాత్రం నితీష్ సీఎం గా ఉంటారు ..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న ఫలితాలు వెలువడగా, ప్రస్తుతం నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 19న లేదా 20వ తేదీన బీహార్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానం వేదిక కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని సమాచారం. మరోమారు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని ఎన్డీయే కూటమి వర్గాలు పేర్కొన్నాయి. అయితే, నూతన సీఎం ఎవరనే దానిపై ఇప్పటి వరకూ అధికారికంగా ఎన్డీయే కూటమి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.