తెలంగాణ వార్తలు

ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు.. చట్టబద్ధమే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు…

RS Praveen Kumar Says Phone Tapping Is Legal Not a Crime
  • ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ కేసు అని ఆరోపణ
  • గతంలో ట్యాపింగ్‌ను సమర్థించిన రేవంత్ రెడ్డిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్న
  • విచారణ పేరుతో వేధిస్తే అధికారులను వదిలిపెట్టబోమని హరీశ్‌ రావు హెచ్చరిక

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాదని, అది దేశ రక్షణ కోసం చేపట్టే చట్టబద్ధమైన ప్రక్రియ అని పేర్కొనడం కలకలం రేపుతోంది.

ఇవాళ‌ మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ అంశంపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. “దేశ రక్షణ, ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు రహస్యంగా ఫోన్లను ట్యాప్ చేస్తారు. ఇది స్వాతంత్య్రం రాకముందు నుంచే అమల్లో ఉన్న చట్టబద్ధమైన ప్రక్రియ. దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కూడా చెప్పారు” అని ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. 

గతంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం ట్యాపింగ్ తప్పు కాదని వ్యాఖ్యానించారని, మరి ఇప్పుడు ఆయనను ఎందుకు విచారించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కేసును వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఉన్నత పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. కీలకమైన డేటాను ధ్వంసం చేయడం, ప్రైవేట్ వ్యక్తుల సంభాషణలను నిబంధనలకు విరుద్ధంగా వినడం వంటి అంశాలపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు ఈ కేసు విచారణను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన కేసు అని, తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. విచారణ పేరుతో తమను ఇబ్బందులకు గురిచేసే అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారు ఎక్కడున్నా పట్టుకొస్తామని ఆయన హెచ్చరించారు. మొత్తం మీద, సిట్ విచారణ వేగవంతం కావడం, బీఆర్ఎస్ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సజ్జనార్ నోటీసులు.. ఆధారాలివ్వకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరిక

RS Praveen Kumar Sajjanar issues notices over allegations of criminal cases
  • బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సిట్ చీఫ్ సజ్జనార్ నోటీసు
  • తనపై ఏడు క్రిమినల్ కేసులున్నాయన్న ఆరోపణలపై తీవ్ర స్పందన
  • రెండు రోజుల్లో ఆధారాలు సమర్పించాలని ఆదేశం
  • లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిక
  • విచారణను అడ్డుకునేందుకే నిరాధార ఆరోపణలని నోటీసులో పేర్కొన్న సజ్జనార్

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సిట్ చీఫ్ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రెండు రోజుల్లో ఆధారాలు సమర్పించాలని కోరుతూ శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ చేశారు.

శుక్రవారం ఉదయం ప్రవీణ్ కుమార్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. సజ్జనార్‌పై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన నేతృత్వంలోని సిట్ విచారణ సరికాదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులకు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. సజ్జనార్‌పై ఉన్న కేసుల విచారణకు మరో సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలను సజ్జనార్ తీవ్రంగా ఖండించారు. ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు పరువుకు నష్టం కలిగించేలా, బాధ్యతారహితంగా, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. “ఈ తప్పుడు ఆరోపణల ద్వారా సిట్, దాని చీఫ్ ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా, చట్టబద్ధమైన విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. దర్యాప్తు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు” అని సజ్జనార్‌ తెలిపారు.

తనపై ఉన్నాయని ఆరోపిస్తున్న ఏడు క్రిమినల్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను నోటీసు అందిన రెండు రోజుల్లోగా సమర్పించాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా స్పందించకపోతే, పరువు నష్టం దావాతో పాటు సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారులు, జర్నలిస్టులతో పాటు పలువురి ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

మీడియా చానళ్ళు అడ్డగోలుగా ప్రసారాలు చేస్తున్న లీక్ వార్తలు ఆపాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు …సిట్ విచారణలో భాగంగా లోన జరుగుతున్న విచారణపై మీ కు ఎవరు లీకులు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు ..లోపల జరగని దాన్ని జరిగినట్లు ప్రసారం చేయడం తగదని హితవు పలికారు ..అక్కడ ఏమి జరక్కపోయిన జరిగినట్లు బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేస్తున్నారని ఇది ఎలా కరెక్టో చెప్పాలని అన్నారు .అదే సందర్భంలో లీకులు ప్రసారం చేస్తున్నవాళ్లు కూడా ఆలోచించుకోవాలని అన్నారు ..మొన్న తాను విచారణకు పోయినప్పుడు అన్నీ అబద్ధాలు ప్రచారం చేశారని ఇది ఏ రకంగా న్యాయం అని అన్నారు .మాకు మీడియా తో సంత్సంబందాలు కలిగి ఉండటం అలవాటు .దాన్ని మీరు కూడా ఆలోచించడం మంచిది .
మీడియా సంస్థల మీద పరువు నష్టం వేయలేక కాదు.మీడియాతో మంచి రిలేషన్ మైంటైన్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి లీకుల ప్రచారంలో ఆలోచించుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం అని హరీష్ రావు అన్నారు .

Related posts

కామారెడ్డి జిల్లాలో విషాదం …ఇద్దరు పిల్లలు తండ్రి బావుల్లో దూకి మృతి

Ram Narayana

ఉచిత ప్రయాణ సౌకర్యం నేపథ్యంలో మహిళలకు టీఎస్ఆర్టీసీ కీలక విజ్ఞప్తి

Ram Narayana

జన్వాడలోని కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌పై అర్ధరాత్రి పోలీసుల దాడులు…

Ram Narayana