కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత..
బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, షబీర్ అలీ మధ్య భూ కబ్జాల ఆరోపణలు
బీజేపీ ఎమ్మెల్యే అరోరా భూములు కబ్జా చేశాడని ఆరోపించిన షబీర్ అలీ, దీంతో దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరిన వెంకటరమణ రెడ్డి
వెంకటరమణారెడ్డి సవాల్ స్వీకరించి, అతని క్యాంపు కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు, ఇరు వర్గాల మధ్య తోపులాట
ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కారుపై దాడి చేసి, కారును బోల్తా పడేసిన బీజేపీ కార్యకర్తలు
పరిస్థితి అదుపుతప్పడంతో కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..🔥
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డిలో అవినీతి లేని పాలన చేస్తున్నానని అన్నారు. ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్వలేని షబ్బీర్ అలీ.. రెచ్చిపోయి ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని మండిపడ్డారు. నాకు రాజకీయ భిక్ష పెట్టానని షబ్బీర్ అలీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నా రాజకీయ గురువు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వెంకట రమణారెడ్డి కీలక ప్రకటన చేశారు. షబ్బీర్ అలీ వల్లే తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని అన్నారు. షబ్బీర్ అలీ అవినీతి బాగోతం మాచారెడ్డి ప్రజలకు తెలుసని చెప్పారు. ఆధిపత్యం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని అన్నారు.
ఇది కేవలం ట్రైలర్ మాత్రమే..!!
మహేందర్ రెడ్డిపై దాడి కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా వేరే ఉంది. నేను పిలిస్తే వేలాది మంది వచ్చేవారు. నేను చర్చకు పిలిస్తే.. మీరే దాడులకు తెగబడ్డారు. అరోరా కాలేజీ భూముల్లో ఎవరు అవినీతి చేశారో కామారెడ్డి ప్రజలకు తెలుసు. నాపై ఇకనుంచి గీత పడినా ప్రభుత్వానిదే బాధ్యత అని కాటిపల్లి వెంకట రమణారెడ్డి కీలక ప్రకటన చేశారు.