అంతర్జాతీయం

అమెరికాలో విద్యాధికుల మత సమూహం హిందువులు: సర్వే

  • ప్రతి పదిమందిలో 7గురు పట్టభద్రులుగా ఉన్న హిందువులు
  • 65 శాతం పట్టభద్రులతో రెండో స్థానంలో యూదులు
  • అమెరికా జాతీయ సగటు కంటే ఎక్కువ పట్టభద్రుల జాబితాలో ముస్లింలు, బౌద్ధులు

అగ్రరాజ్యంలో హిందువులు అత్యంత విద్యాధికులుగా ఉన్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆ తర్వాత వరుసగా యూదులు, ముస్లింలు, బౌద్ధులు, ఆర్థడాక్ క్రైస్తవులు ఉన్నట్లు వ్యూ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన ఒక సర్వే నివేదిక తెలిపింది. ఈ మత సమూహాలలో ప్రతి పదిమందిలో నలుగురు అంతకంటే ఎక్కువ మంది బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉన్నారు.

వివిధ మతవర్గాల స్థితిగతులపై 2023-24లో నిర్వహించిన రిలిజియస్ ల్యాండ్ స్కేప్ (ఆర్ఎల్ఎస్) సర్వేలో వెల్లడైన గణాంకాల ఆధారంగా ఈ అధ్యయన నివేదిక సిద్ధం చేశారు.

అమెరికాలోని ప్రతి పదిమంది హిందువులలో 7 గురు పట్టభద్రులుగా ఉన్నారు. అంటే 70 శాతం మంది హిందువులు బ్యాచిలర్ డిగ్రీ లేదా ఉన్నతస్థాయి విద్యను అభ్యసించినవారు ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న యూదుల్లో 65 శాతం మంది పట్టభద్రులు ఉన్నారు.

అమెరికాలో పట్టభద్రుల సగటు 35 శాతంగా ఉంది. అమెరికా జాతీయ సగటు కంటే, ముస్లింలు, బౌద్ధులు, ఆర్థడాక్ క్రైస్తవులు, సాధారణ ప్రొటెస్టెంట్ క్రైస్తవుల్లో ఎక్కువ మంది పట్టభద్రులు ఉన్నారని ఈ నివేదిక తెలిపింది. ఇవాంజెలిక్ ప్రొటెస్టెంట్లు, కేథలిక్కుల్లో జాతీయ సరాసరి సగటు కంటే తక్కువ సంఖ్యలో పట్టభద్రులు ఉన్నారు. హిందువులు, ముస్లింలలో పట్టభద్రులు ఎక్కువగా ఉండటానికి కూడా ఈ నివేదిక కారణాన్ని వెల్లడించింది. వీరంతా ఉన్నత చదువుల కోసమే అమెరికాకు వస్తున్నందున వారిలో పట్టభద్రుల సంఖ్య ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది.

Related posts

మరో విమాన ప్రమాదం.. నార్వేలో రన్‌వే నుంచి జారిపోయిన విమానం..!

Ram Narayana

గాజాపై ఇజ్రాయెల్ దాడి .. 130 మందికిపైగా మృతి!

Ram Narayana

ఇజ్రాయెల్ ఆర్మీ ముందుకొస్తే బందీల కాల్చివేత.. హమాస్ ఆదేశాలు!

Ram Narayana