తెలంగాణ వార్తలు

ఏపీలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపండి… అమిత్ షాకు మంత్రి తుమ్మల లేఖ

భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పాలనా సౌలభ్యం, స్థానిక గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఈ విలీనం అత్యవసరమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.పురోషోత్తపట్నం , గుండాల, పిచుకలపాడు ఎటపాక కన్నాయుగుడెం గ్రామాలు తెలంగాణ నుంచి ఏపి ల కలవగా భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం భూముల మాత్రం ఆ గ్రామాల్లోకి వెళ్లి పోయాయి ..దీనితో లీగల్ చిక్కులు ఏర్పడుతున్నాయి .

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తుమ్మల వివరించారు. ఈ గ్రామాలను భద్రాచలంలో విలీనం చేయడం ద్వారా గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ అంశంపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే విలీనానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అమిత్ షాను కోరారు.

స్థానిక సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి, సానుకూలంగా స్పందించాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

మంచు మనోజ్‌పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్‌తో మోహన్ బాబు ఏమన్నారంటే?

Ram Narayana

ఐబొమ్మ రవికి పోలీసుల జాబ్ ఆఫర్.. తిరస్కరించిన నిందితుడు…

Ram Narayana

కవిత వాస్తవాలు బయటపెడుతున్నారు.. బండి సంజయ్‌ని తొలగించింది అందుకే: మహేశ్ కుమార్ గౌడ్

Ram Narayana