తెలంగాణ వార్తలు

రేవంత్ మాట తప్పిండు …మంత్రులు వినిపించుకోవట్లేదు …అసలు ప్రభుత్వం ఉందా ..?పోచారం

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పిండు… ప్రభుత్వంపై పోచారం ఘాటైన విమర్శలు
బీఆర్ యస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జి ఓ లు వచ్చేవి
ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలనీ మంత్రుల కళ్ళు మొక్కలా…?
ఈ ప్రభుత్వంలో మంత్రులు.., ఎమ్మెల్యేల ఫోన్లు లేపరు
అసలు ప్రభుత్వం ఉందా …? ఉంటె పనిచేస్తుందా..?అనే అనుమానం కలుగుతుందన్న పోచారం

సీనియర్ శాసనసభ్యులు ,మాజీ స్పీకర్ ,మాజీ మంత్రి బీఆర్స్ నుంచి కాంగ్రెస్ కు అనుకూలంగా మారిన బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ పై ఘాటైన విమర్శలు చేశారు …తనకు సిద్దాపురం రిజర్వాయర్ కు నిధులు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ,20 సార్లు సీఎం కలిసి చెప్పిన నిధులు మంజూరు చేయకపోవడం దారుణమని వాపోయారు …బీఆర్స్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జి ఓ లు వచ్చేవని ఇక్కడ మంత్రుల వద్ద ఎన్ని సార్లు మొత్తుకున్నా అరణ్యరోదన అవుతుంది తప్ప పనులు మాత్రం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు ..నేను ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాలు మొక్కాల్నా? అని ప్రశ్నించారు ..
సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ సొంత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న పోచారం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పిండు
ఈ ప్రభుత్వంలో మంత్రులు.., ఎమ్మెల్యేల ఫోన్లు లేపరు ప్రభుత్వం ఉందా… ఉంటే అది పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతుందని విమర్శలు గుప్పించారు ..

ఇటీవలనే సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి టి .జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు బై చెప్పి బీఆర్స్ లో చేరుతున్న వేళ పోచారం లాంటి సీనియర్ నేత నుంచి ప్రభుత్వం వ్యతిరేక మాటలు రావడం ఇబ్బందికరమే అనే మాటలు వినిపిస్తున్నాయి…

Related posts

కడు రమ్యం … రాములోరి కళ్యాణం

Ram Narayana

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత

Ram Narayana

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి…

Ram Narayana