ఖమ్మం వార్తలు

కలెక్టర్ కు టియుడబ్ల్యూజే (ఐజేయు) అభినందనలు

కలెక్టర్ కు టియుడబ్ల్యూజే (ఐజేయు) అభినందనలు

పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వక భేటీ

ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా సోమవారం బాధ్యతలు చేపట్టిన టీఎస్ దివాకరకు టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలిపారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో పుష్పగుచ్చం అందజేసి పూర్వకంగా భేటీ అయ్యారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. జర్నలిస్టులు, జర్నలిస్టు యూనియన్ నాయకులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి సహకరించాలని, సూచనలు, సలహాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు నలజాల వెంకట్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మైస పాపారావు, జిల్లా నాయకులు వనం వెంకటేశ్వర్లు, తాళ్లూరి మురళీకృష్ణ, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి నంచర్ల జనార్ధన చారి, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నామ పురుషోత్తం, జిల్లా ఉపాధ్యక్షులు మొయినుద్దీన్, సూర్య సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు గోపాల్, సురేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కలకలం రేపిన మంత్రి పొంగులేటిపై లేఖాస్త్రం …

Ram Narayana

ఖమ్మంలో గౌడ సంఘం భవన నిర్మాణకి శంకుస్థాపన …

Ram Narayana

గీతకార్మికులు భద్రతకే కాటమయ్య కిట్లు …మంత్రి పొంగులేటి

Ram Narayana