మధు ఉయ్ మిస్ యు…మిత్రుడు మారబోయిన మధు మరణం దిగ్బ్రాంతి కరం

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మధు సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు …డిప్యూటీ సీఎం నివాసమైన ప్రజాభవన్ లో విధుల్లో ఉండగానే ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది ..వెంటనే అక్కడ ఉన్న పీఆరో సహాయంతో పక్కనే ఉన్న ఒక హాస్పటల్ కు తీసుకోని వెళ్లారు ..అక్కడ ఇసిజి తీసిన డాక్టర్లు ఏమి లేదని చెప్పారు ..ఆయన నొప్పి తగ్గకపోవడంతో ప్రజాభవన్ నుంచి ఫోన్ చేసి ఆంబులెన్స్ పిలిపించారు …అక్కడ నుంచి సమీపంలో ఉన్న అపోలో స్పెక్ట్రా హాస్పటల్ కు తరలించారు …డాక్టర్లు ఆయన ప్రాణం కాపాడేందుకు సీపీఆర్ చేస్తుండగానే మరోసారి కార్డియాక్ అరెస్ట్ జరిగింది ..దీంతో డాక్టర్ల పర్వేక్షణలో అందరు చూస్తుండగానే ప్రాణాలు వదిలారు ..ఇది నిజంగా దిగ్బ్రాంతి కరమైన వార్త …మంత్రుల దగ్గర పీఆరో గా చేయడం ఆషామాషి కాదు …అనేక పనులు ఉంటాయి ,టెన్షన్ ఉద్యోగం ,అయినప్పటికీ చాకచక్యంగా మెలిగేవారు …
మల్లు భట్టి విక్రమార్కకు ఖమ్మం జిల్లాలో ఆంధ్ర జ్యోతి బ్యూరో ఇంచార్జి గా చేస్తున్నప్పటినుంచి పరిచయం …ఆ పరిచయం ఆయన్ను పీఆరో గా చేసింది ..గత రెండున్నర సంవత్సరాలుగా భట్టి వద్ద చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా అన్ని తానై చూసుకున్నారు …వార్తలు రాయడంలో ,రాయించడంలో తనదైన ముద్ర వేశారు ..
స్నేహశీలి పిలిస్తే పలికేవాడు. ఎలాంటి భేషిజాలు లేకుండా అందర్నీ కలుపుకొని పోయే వ్యక్తి . అందరివాడులా పనిచేసిన ఆప్త మిత్రుడు మారబోయిన మధుసూదన్ మరణించారని వార్త దిగ్బ్రాంతి కలిగించింది …ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న మధు ఆకస్మిక మరణం జర్నలిస్టు ఉద్యమానికి , ప్రత్యేకించి డిప్యూటీ సీఎం భట్టికి తీరని లోటుగానే పరిగణించాలి . నాకు మంచి మిత్రుడు మధు. రెండు దశాబ్దాలుగా పరిచయం. ఖమ్మం జిల్లాలో ఆంధ్రజ్యోతిలో బ్యూరో ఇన్చార్జిగా పనిచేశారు . ఆ సందర్భంగానే ఆయనకు నాకు మంచి స్నేహ సంబంధం ఏర్పడింది . పూర్వాశ్రమంలో తాము ఇరువురం ఎస్ఎఫ్ఐ లో పనిచేసి వచ్చినందున మా ఇద్దరి అభిప్రాయాలు అనేక విషయాల్లో ఒక్కటిగానే ఉండేవి .. అంతేకాకుండా ఇద్దరం అంతకు ముందు ఏపీయూడబ్ల్యూజే లోను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టి యు డబ్ల్యూ జే లో ఉన్నాం … దీంతో కలిసి నడిచే అవకాశం దక్కింది . అనేక సందర్భాల్లో జర్నలిస్ట్ ఉద్యమంలో తోడుగా ఉండేవాడు … మీరు మంచి నిర్మాణ దక్షులని ,వ్యూహకర్త అని ప్రోత్సహించేవారు …నల్గొండ జిల్లా టీయూడబ్ల్యూజే కార్యదర్శిగా పనిచేశారు .. నేను రాష్ట్ర సంఘంలో చాల కాలం ఉపాధ్యక్షులుగా , తర్వాత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సందర్భాల్లో అనేక విషయాలపై చేర్చించుకునేవాళ్ళం … తాను ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆసంస్థకు ,ఆ వ్యక్తికీ చెడ్డపేరు రాకుండా మెలిగేవారు .. తాను చెప్పదలుచుకున్న విషయాలను నాన్చకుండా చెప్పే స్వభావం …ఆయనకు భార్య ,కుమారుడు ఉన్నారు …భార్య టీచర్ ఉద్యోగం చేస్తుండగా కుమారుడు బీటెక్ చదువుతున్నారు ..
డిప్యూటీ సీఎం భట్టి దిగ్బ్రాంతి …
చీఫ్ పీఆరో మధు మరణంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దిగ్బ్రాంతికి లోనైయ్యారు …తన నివాసం వద్ద వీధుల్లో ఉండగానే వైద్యం అందుతుండగా ప్రాణాలు కోల్పోవడంపట్ల షాక్ గురైయ్యారు …అన్ని పనులు పక్కన పెట్టి డాక్టర్లతో మాట్లాడి తగిన వైద్యం అందించాలని ఆదేశించారు . మధుసూదన్ మృతి పట్ల అత్యంత నిజాయితీ గల పాత్రికేయన్ని కోల్పోవడం బాధాకరంగా ఉందని భట్టి అన్నారు. వృత్తిపట్ల అత్యంత నిబద్ధత కలిగిన పాత్రికేయుడని ఉపముఖ్యమంత్రి అన్నారు . ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఆఫీస్ సిబ్బంది ,అధికారులు , కాంగ్రెస్ నాయకులకు మధు మరణ వార్త దిగ్బ్రాంతికి గురిచేసింది ..
మిర్యాలగూడెం లో అంత్యక్రియలు…
మధు అంత్యక్రియలు వారి సొంత పట్టణమైన నల్గొండ జిల్లా మిర్యాలగూడెం లో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు …సోమవారం రాత్రికి మృదేహాన్ని మిర్యాలగూడెం తరలించారు …మంగళవారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు .
నీ జ్ఞాపకాలను వదిలి వెళ్ళిపోయావు …
నీవు రాసిన రాతలు ,చెప్పిన మాటలు ,పంచుకున్న భావాలను పదిలంగా ఉంచుకుంటాం ..
బౌతికంగా లేకపోయినా మా మధ్య ఎల్లప్పుడూ జీవించే ఉంటావు …అమర్ రహే మారబోయిన మధు …
మధు ఉయ్ మిస్ యు…