Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వ్యవసాయచట్టాలపై నోరుజారి నాలుక కరుచుకున్న కేంద్ర మంత్రి తోమర్ !

వ్యవసాయచట్టాలపై నోరుజారి నాలుక కరుచుకున్న కేంద్ర మంత్రి తోమర్ !
-వ్యవసాయచట్టాలు మళ్ళీ మరింత పకడ్బందీగా తెస్తాం నిన్న …నరేంద్ర సింగ్ తోమర్
-అబ్బే ఆలా అనలేదు …వ్యవసాయచట్టాల విషయంలో తాను ఆలా మాట్లాడలేదు ఈరోజు
-మూడు వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం ఎన్నికల స్టంటేనా..?
-మరింత పకడ్బందీగా ఈ చట్టాలను తెచ్చేందుకు కేంద్రం సిద్ధమైందా..?

కేంద్రవ్యవసాయ మంత్రి నరేద్రసింగ్ తోమర్ వ్యవసాయ చట్టాలపై నోరుజారి ,నాలుక కార్చుకున్నారు…. నిన్న ఒకకార్యక్రమంలో మాట్లాడుతూ వ్యవసాయచట్టాలను రద్దు చేసినప్పటికీ మరింత పకడ్బందితో మళ్ళీ తెస్తామని కుండబద్దలు కొట్టారు. ప్రధాని మోడీ వ్యవసాయచట్టాలను కొన్ని సవరణలతో తేనున్నారని పేర్కొన్నారు. దీంతో రైతులు రైతు సంఘాలు దీనిపై మండిపడ్డాయి. కేంద్రవైఖరి ఏమిటో అర్థం అయిందని దొంగ దెబ్బకొట్టేందుకు సిద్దమైనట్లు తోమర్ మాటలు ఉన్నాయని అందువల్ల అప్రమత్తమగ ఉండాలని రైతులకు పిలుపు నిచ్చాయి. తోమర్ మాటలు దేశవ్యాపితంగా విమర్శలు వెల్లు వెత్తాయి .చివరకు బీజేపీ శ్రేణులు కూడా వ్యవసాయమంత్రి ప్రకటనపై ఆయోమయానికి గురైయ్యాయి.

అదను చూసి సాగుచట్టాలు అమలుచేయనుందా..? కేంద్ర వ్యయసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతోంది. రైతుల మేలు కోసం ఒక్క అడుగు వెనక్కి వేశామని..భవిష్యత్తులో మళ్లీ చట్టాలు తెస్తామని తోమర్ ప్రకటించారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో తోమర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు దేశవ్యాప్తంగా దుమారం సృష్టిస్తున్నాయి.
తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవడంతో తోమర్ స్పందించారు. కేంద్రం మళ్లీ చట్టాలు తీసుకొస్తుందని.. తానెప్పుడూ చెప్పలేదన్నారు. అయితే…వ్యవసాయ చట్టాల ముప్పు తొలగిపోలేదేని..మళ్లీ ముంచుకొస్తుందని తోమర్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు అలా ముగిశాయో లేదో…ఇలా కేంద్రమంత్రి తోమర్ తన మనసులో మాట బయటపెట్టేశారు. ప్రస్తుతం అలా అనలేదని అంటున్నారు.
గత ఏడాది మూడు వ్యవసాయ చట్టాల ఆమోదం తర్వాత రైతులు భగ్గుమన్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ నుంచి లక్షలాదిగా తరలివచ్చిన రైతులు ఢిల్లీని వణికించారు. సరిహద్దుల్లోనే స్థావరాలు ఏర్పరుచుకుని చట్టాల రద్దు కోసం పోరాడారు. ఏడాది కాలంలో విజ్నాన్ భవన్‌లో రైతు సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు సరికదా..ఒక్కసారి కూడా…అవి సంతృప్తికరంగా సాగలేదు. రైతు సంఘాలు చేస్తున్న ఏ డిమాండ్లనూ కేంద్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్‌లో హింస చెలరేగిన తర్వాత ఇక ఇరువర్గాల మధ్య చర్చలన్నదే జరగలేదు. రైతులు సరిహద్దులనే తమ నివాసప్రాంతాలుగా మార్చుకుని అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలోనే రైతు ఉద్యమం ఏడాది కాలం పూర్తిచేసుకుంది. ప్రాణాలకు తెగించి..రైతులు పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న భావనలోకి వెళ్లిపోయారు దేశ ప్రజలు.

Related posts

చిరు వ్యాపారులపై కేంద్రం వివక్ష వారికీ అండగా నిలుద్దాం :స్టాలిన్

Drukpadam

ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన మయన్మార్ సైనిక పాలకులు!

Drukpadam

హుస్నాబాద్ ఎమ్మెల్యే స‌తీశ్ కుమార్‌కు చేదు అనుభ‌వం!

Drukpadam

Leave a Comment