Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దోపిడీ పీడన ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది..సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని…

దోపిడీ పీడన ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది..సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని…
-మే డే స్ఫూర్తితో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి…
-పని గంటల తగ్గింపు కోసం జరిగిన వీరోచిత పోరాటం మే డే
-మోడీ ప్రభుత్వం పనిగంటలు పెంచడాన్ని కార్మిక వర్గం సహించదు
-నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలి
-ప్రశ్నించే గొంతులను అణిచి వేస్తున్న మోడీ ప్రభుత్వం …నున్నా

 

మే డే స్ఫూర్తితో దేశ ఐక్యతకు విగాథం కలిగించే మతోన్మాద, కార్మిక వర్గ వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపడం ద్వారా మాత్రమే కార్మిక వర్గం హక్కులను, దేశాన్ని కాపాడుకోగలమని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.

సిపిఎం, సిఐటియు ఖమ్మం 3 టౌన్ కమిటీల ఆధ్వర్యంలో వివిధ యూనియన్ల జెండాలను 137 వ మేడే దినోత్సవం సందర్భంగా ఎగరవేయడం జరిగింది. ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని కార్మిక వర్గం నినదించడం జరిగింది. అనంతరం ప్రదర్శనగా బోసు బొమ్మ సెంటర్ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ లో భారీ బహిరంగ సభ త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కొత్త హక్కుల కోసం కొట్లాడాల్సింది పోయి ఈ బిజెపి ప్రభుత్వంలో ఉన్న హక్కులను పరిరక్షించుకోవడం కోసం కార్మిక వర్గం కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బ్రిటిష్ కాలంలో పోరాడు సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం నేడు తొలగించబడుతుందన్నారు. 8 గంటల పని దినం కోసం మరో చికాగో పోరాటాన్ని మన దేశంలో నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. మొత్తం కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా తీసుకొచ్చి కార్మికులకు గుండెకాయ లాంటి అనేక అంశాలను తొలగించారన్నారు. మోదీ ప్రభుత్వం ఒకపక్క కార్పొరేట్ అనుకూల విధానాలు మరోపక్క మతోన్మాద చర్యలను రెచ్చగొడుతూ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ వర్గ ఐక్యతను దెబ్బతీస్తుందన్నారు. మనుధర్మం ఆధారంగా ప్రభుత్వ పాలన కొనసాగించాలని ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. బీజేపీ విధానాల ఫలితంగా రోజురోజుకీ అంతరాలు పెరిగిపోతున్నాయని, ఆకలి ఉన్నంతకాలం, సమస్యలు ఉన్నంతకాలం, అంతరాలు ఉన్నంతకాలం ఎర్ర జెండా ఉంటదని దీనిని ఆపడం ఎవరి తరం కాదని ఎర్రజెండా నీడన మేడే స్ఫూర్తితో మరొక్కసారి దేశమంతా కార్మిక వర్గం, అన్ని వర్గాలు గర్జించి దేశ రక్షణ కోసం పోరాటాలలోకి రావాలని పిలుపునిచ్చారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రశ్నించే గోంతులను సిబిఐ, ఈడి వంటి సంస్థలను ఉపయోగించి నిర్బంధాలకు గురిచేస్తుందన్నారు. ఎదురు తిరిగిన వారిని హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదన్నారు. కావున రాజ్యాంగం కల్పించబడిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును స్వతంత్రంగా ఉపయోగించుకునే లాగా మేడే స్ఫూర్తితో ఐక్యతను చాటి పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్యాణ వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, పి.విష్ణు, తుషాకుల లింగయ్య టౌన్ నాయకులు బండారు యాకయ్య, వజినే పల్లి శ్రీనివాసరావు, ఎస్ కే సైదులు, ఎర్ర గోపి, యల్లంపల్లి వెంకట్రావు, పత్తిపాక నాగ సులోచన, శీలం వీరబాబు, బండారు వీరబాబు, షేక్ ఇమామ్, ఎస్.కె బాబు, బజ్జూరి రమణారెడ్డి, పోతురాజు జార్జి, మద్ది సత్యం,వేల్పుల నాగేశ్వరరావు, యస్ కె ఖాశీం, గబ్బెటి పుల్లయ్య, రంగు హనుమంతచారి, అలివేలు తదితరులు పాల్గొన్నారు

వివిధ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వరంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మిక వాడలన్నీ ఎర్ర జెండాలతో రెపరెపలాడాయి. దీంతో ఒక పండుగ వాతావరణం కనిపించింది. ఇది ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాపితంగా ఎంతో ఉత్సాహం తో కార్మికులు జరుపుకున్నారు .

Related posts

పొంగులేటి రాజకీయ అడుగులపై ఆసక్తి ..

Drukpadam

‘మహా’ పరిణామం.. శరద్‌పవార్‌‌ను కలిసిన అజిత్ పవార్!

Drukpadam

బీజేపీతో సరిపడదు …. పార్టీ మార్పు పై కేంద్ర మాజీమంత్రి రేణుక చౌదరి !

Drukpadam

Leave a Comment