Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

వరుసగా ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలతో జగన్ భేటీ…

వరుసగా ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలతో జగన్ భేటీ…

  • ప్రధానితో దాదాపు గంటన్నరపాటు సమావేశమైన జగన్
  • ఆ తర్వాత ఆర్థికమంత్రి నిర్మలతో భేటీ
  • వరుస భేటీల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, ఆర్థికసాయంపై చర్చ

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు ప్రధానితో సమావేశమైన జగన్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. ఏపీకి ఆర్థిక సాయం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఇతర అంశాలపై నిర్మలతో చర్చించారని సమాచారం. అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన 45 నిమిషాల సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, పోలవరం ప్రాజెక్ట్ నిధులు తదితర అంశాలపై జగన్ చర్చించినట్టు తెలుస్తోంది. 45 నిమిషాల పాటు కొనసాగిన వీరి భేటీ ఇప్పుడే ముగిసింది. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రిని కలుస్తారు. అంతకుముందు ఢిల్లీ విమానాశ్రయంలో జగన్ కు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు స్వాగతం పలికారు.

Related posts

గ్రామం యూనిట్ గా ప్రజాసమస్యలపై ఉదృతం పోరాటాలు …తమ్మినేని

Drukpadam

ఏపీ లో మొత్తం 24 మంది మంత్రుల రాజీనామా …తిరిగి వచ్చేది ఎవరు ?

Drukpadam

బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి…!

Drukpadam

Leave a Comment