క్రైమ్ వార్తలు

ఖమ్మం సమీపంలో భూదాన్ భూముల్లో టెన్షన్ టెన్షన్…

ఖమ్మం సమీపంలో భూదాన్ భూముల్లో టెన్షన్ టెన్షన్…
పేదల గుడిశెలను తొలగించిన అధికారులు
పట్టాభూముల్లో గుడిశెలు వేసినందుకు ఫిర్యాదు మేరకు తొలగించమంటున్న అధికారులు
డోజర్ కు అడ్డంపోయిన వారిని నెట్టివేసిన వైనం స్పృహతప్పి పడిపోయిన మహిళలు
వెలుగుమట్ల లోని 147 ,148 ,149 భూముల్లో గుడిశెలు
అవి భూదాన భూములు అంటున్న గ్రామీణ పేదల సంఘం…

ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన భూముల్లో శనివారం ఉదయం 8 గంటల వరకే కొందరు వ్యక్తులు గుడిసెలు వేశారు. ఈ భూముల విషయంపై కొన్నేళ్లు గా వివాదం కొనసాగుతోంది. సర్వే నెంబర్ 147, 148 149 లో సుమారు 62 ఎకరాలకు 2014 లో ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు ప్రతి కుటుంబానికి 100 గజాల చొప్పున ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు కాగితాలు చూపుతున్నారు. 2018 డిసెంబర్లో సుమారు 1000 కుటుంబాలు 30 ఎకరాల్లో గుడిసెలు వేసుకొని నవోదయ కాలనీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తమకు విద్యుత్, మంచినీరు ఇతర మౌలిక వసతులు కల్పించాలని పలు మార్లు ఆందోళన చేశారు. అధికారులకు విన్నవించారు. అయినా అధికారులు స్పందించలేదు. 2019 సెప్టెంబర్ లో మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశాలున్న నేటికీ అమలు కాలేదని కాలనీ వాసులు తెలిపారు. ఇల్లు లేని, స్థలం లేని, అద్దె ఇళ్లల్లో ఉండలేక 1000 కుటుంబాలు శనివారం ఉదయం మిగిలిన 30 ఎకరాల్లో గుడిసెలు వేసేందుకు సామాగ్రి తీసుకొచ్చారు. వారిని రెవెన్యూ , పోలీస్ అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రొక్లెయినర్లు, ఫైర్ ఇంజన్లతో గుడిసెల వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. పోలీసులను అడ్డుకునేందుకు నవోదయ కాలనీ వాసులు భారీగా తలి వచ్చారు. కాలనీ వాసులు పొలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఆక్రమణదారులు వేసిన గుడిసెలు, కర్రలు తొలగించారు. దీంతో ఉద్రిక్తత వాతవరణం నెలకొంది.

కలెక్టర్ ప్రకటన: ఖమ్మం అర్బన్ మండలంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల ఆక్రమణలు సహించేది లేదని, కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. వెలుగుమట్ల లో సర్వే నెంబర్ 147, 148, 149 లలో భూదాన్ భూములు ఉన్నాయని ఒకరిద్దరు దళారులు అమాయక పేద ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి, వారిని భూదాన్, పరిసర పట్టా భూముల ఆక్రమణకు ఉసిగోల్పుతున్నట్లు, వారిని మోసం చేస్తున్నట్లు కలెక్టర్ ఆరోపించారు. దళారులు ఒక్కొక్కరి నుండి రూ. 40 వేల నుండి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఖమ్మం నుండే కాక సూర్యాపేట, తల్లాడ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలచే భూ ఆక్రమణలు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం భూ ఆక్రమణ చేసి 300 షెడ్లు వేయగా, అన్నింటిని కూల్చివేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలెవ్వరు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, భూ ఆక్రమణలపై కఠిన చర్యలు వుంటాయని, భూ ఆక్రమణదారులు, ప్రోత్సహించిన వారిపై భూ ఆక్రమణ, క్రిమినల్ కేసులతో పాటు పిడి యాక్ట్ నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.

Related posts

అమ్మాయిలకు పోర్న్ వీడియోలు చూపిస్తూ స్కూల్ టీచర్ లైంగిక వేధింపులు..!

Ram Narayana

వచ్చే వారం అధికారుల ముందు లొంగిపోనున్న ట్రంప్..?

Drukpadam

బీజేపీ నేత జితేంద‌ర్ రెడ్డి ఇంటిలో న‌లుగురి కిడ్నాప్‌!

Drukpadam