సభానిర్వహణ తీరుపై భట్టి ఆక్షేపణ …ప్రశ్నలు మీరే సమాదానాలు మీవే ఇదేమి పద్దతి …
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై భట్టి విక్రమార్క విమర్శలు
సభలో అప్పటికప్పుడు ఎజెండా పెడితే ఎలా అని మండిపాటు
ప్రశ్నోత్తరాలలో ప్రతిపక్షాలకు సమయం ఇవ్వడంలేదని ఆరోపణ
ప్రశ్నలు, జవాబులు అధికార పార్టీ నేతలే చెబుతున్నారని అసహనం
తెలంగాణ శాసనసభ సమావేశాలు నిన్నటినుంచి ప్రారంభమైయ్యాయి…కానీ సభ ఎన్ని రోజులు జరుగుతుంది. ఏ ఏ అంశాలు చర్చకు వస్తాయనేది ప్రతిపక్షాలకు తెలియకుండా డార్క్ న పెట్టి అప్పటికప్పుడు ఎజెండా పెట్టడం సభ మర్యాద కాదు …ఎలా సభలు నడపడం ఎప్పుడు చూడలేదు …ప్రతిపక్షాలకు సమయం ఇవ్వడంలేదు .సభలో చర్చించాల్సిన అంశాలు చాల ఉన్నాయి. రాష్ట్ర కురిసిన భారీ వర్షాలు , ప్రాజక్టులు , మునిగిపోయిన గ్రామాలూ ప్రాణ ఆస్తి , నష్టం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించాల్సి ఉంది …ప్రజస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా సభ నిర్వహణ తీరు సంజసంకాదు …ప్రజలు గమనిస్తున్నారు . మెజార్టీ ఉందికదా అని బొల్డోజ్ చేసుకుంటే పొతే పౌరసమాజం క్షమించదని సీఎల్పీ నేత భట్టి అధికార పార్టీకి ఘాటు హెచ్చరికలు చేశారు ..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయో కూడా ప్రతిపక్షాలకు సమాచారం లేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వం ఇష్టారీతిన సమావేశాలు జరుపుతోందని, సభలో ఎజెండా గురించి తమకు ముందుగా చెప్పడంలేదని విమర్శించారు. సమావేశాల నిర్వహణ తీరుపై భట్టి విక్రమార్క శుక్రవారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు టేబుల్ పై ఎజెండా పెడితే చర్చించేదెలా అంటూ అధికార పార్టీపై ధ్వజమెత్తారు.
ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేతలకు సమయం ఇవ్వడంలేదని స్పీకర్ పై సీఎల్పీ లీడర్ ఆరోపించారు. ప్రశ్నలు, వాటికి జవాబులు కూడా అధికార పార్టీ నేతలే చెబుతున్నారని చెప్పారు. ప్రశ్నకు సభ్యుడి పేరు ఉంటేనే మైక్ ఇస్తామని అనడం శాసన సభ్యుల హక్కులను కాలరాయడమేనని భట్టి విక్రమార్క విమర్శించారు. మనమందరం ప్రజలకు జవాబుదారులం అంతే కానీ ఐదు సంవత్సరాలకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అమ్మేసి దివాళా తివిస్తామంటే కుదరదని ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు . మాకు ఎవరిమీద వ్యక్తిగత కోపం లేదు …రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అంతే కానీ రాజులలాగా వ్యవహరిస్తమెంటే కుదరదు అని తన అభిప్రాయాలను భట్టి కుండబద్దలు కొట్టారు …