Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

న్యాయబద్ధమైన దర్యాఫ్తు చేస్తామని కెనడా చెప్పిందన్న అమెరికా

  • నిజ్జర్ హత్యపై పూర్తి, న్యాయమైన విచారణ జరగాలని అమెరికా భావిస్తోందన్న మాథ్యూ మిల్లర్
  • భారత్ కూడా సహకరించాలన్న అమెరికా ప్రతినిధి
  • అమెరికాకు భారత్ కీలక భాగస్వామిగా ఉందని వ్యాఖ్య

బ్రిటిష్ కొలంబియాలో వేర్పాటువాద ఖలిస్థాన్ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో కెనడా చేసిన ఆరోపణలపై పూర్తి, న్యాయబద్ధమైన దర్యాఫ్తు జరగాలని అమెరికా పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ… భారత్ పై చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి, న్యాయమైన విచారణ జరగాలని తాము భావిస్తున్నామన్నారు.

కెనడా ఆ విధంగా ముందుకు వెళ్లడానికి కట్టుబడి ఉన్నట్లుగా చెప్పిందని, భారత ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు ముగిసిన అనంతరం కెనడా, భారత్ మధ్య వివాదంపై ఓ ప్రశ్నకు మాథ్యూ మిల్లర్ సమాధానమిచ్చారు. కెనడాలోని పరిస్థితులపై తాము ఆందోళన చెందుతున్నామని, దీనిని తాము పరిశీలిస్తున్నామని, అదే సమయంలో దర్యాఫ్తుకు సహకరించాలని భారత్‌ను కోరామని చెప్పారు. అమెరికాకు భారత్ కీలక భాగస్వామిగా ఉందన్నారు.

Related posts

నేను ప్రధాని అయితే భారత్ తో సత్సంబంధాలు: కెనడా ప్రతిపక్ష నేత

Ram Narayana

ఆ విషయంలో మోదీ ప్రభుత్వ వైఖరితో ఏకీభవిస్తున్నట్లు చెప్పిన రాహుల్ గాంధీ!

Ram Narayana

కెనడా పార్లమెంట్ వెలుపల ‘ఓం’ జెండాను ఎగురవేసిన భారత సంతతి ఎంపీ

Ram Narayana

Leave a Comment