Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

పల్లవి ప్రశాంత్ ఎందుకు గెలిచాడంటే .. పబ్లిక్ టాక్!

  • బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్
  • మొదటి నుంచి ప్రదర్శించిన తనదైన ఆట తీరు 
  • హౌస్ లోను వారికి గట్టిపోటీ ఇచ్చిన ప్రశాంత్ 
  • రైతు బిడ్డకు జనం నుంచి లభించిన ఆదరణ  

పల్లవి ప్రశాంత్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7లో తను విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 7లో ఈ సారి సభ్యులంతా ఒక రేంజ్ లో పోటీ పడ్డారు. చాలామంది సినిమాలు .. సీరియల్స్  .. యూ ట్యూబ్ నేపథ్యం నుంచి వచ్చినవారే .. ఇక్కడ కల్చర్ కి అలవాటు పడినవారే. అయితే పల్లవి ప్రశాంత్ విషయానికి వచ్చేసరికి అతను వచ్చిన నేపథ్యం వేరు. అతను చూస్తూ పెరిగిన పరిస్థితులు వేరు. 

‘బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అంత తేలికైన విషయమేం కాదు. బయట సరదాగా .. స్వేచ్ఛగా తిరిగేవారు లోపల ఎక్కువ రోజులు ఉండలేరు. గతంలో ‘సంపూర్ణేశ్ బాబు’ విషయంలో ఇదే జరిగింది. సినిమాలు .. సీరియల్స్ నుంచి వచ్చిన వారి మధ్య ఎంతో కొంత పరిచయాలు ఉంటాయి. బిగ్ బాస్ హౌస్ వాతావరణానికి వాళ్లు తొందరగా అలవాటు పడతారు కూడా. నిజానికి ఇలాంటివేం పల్లవి ప్రశాంత్ కి తెలియదు. 

తనని తాను రైతు బిడ్డగా పరిచయం చేసుకుంటూ .. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాను అనుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పాడు. తనని చేరదీసిన వారి పట్ల సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. అవసరమైన చోట ‘బరా బర్ చెప్తా … నేను ఇంతే’ అంటూ తన వాదనను బలంగా వినిపించాడు. పల్లవి ప్రశాంత్ ఎందుకు గెలిచాడు? అనే ప్రశ్నకి బటయ నుంచి మూడే మాటలు వినిపిస్తున్నాయి. పోటీతత్వం .. నిజాయతీతో కూడిన అమాయకత్వం .. సాటి రైతుల పట్ల వ్యక్తం చేసిన ప్రేమ.   

Related posts

అల్లు అర్జున్ విడుద‌ల ఆల‌స్యంపై.. చట్టపరమైన చర్యల యోచ‌న‌లో ఆయన తరఫు న్యాయవాదులు!

Ram Narayana

సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి ఏపీకి 5 వేల బస్సులు!

Ram Narayana

Ram Narayana

Leave a Comment