తెలంగాణ రాజకీయ వార్తలు ..

ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించండి …బీజేపీ జాతీయ నాయకులు డాక్టర్ పొంగులేటి

ప్రధాని మోడీజీ ని తిరిగి ప్రధాని చేసుకునేందుకు ,సంవర్దవంతమైన ఆయన నాయకత్వాన్ని బలపరిచేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని బీజేపీ జాతీయ నాయకులు , తమిళనాడు ,కర్ణాటకల కో -ఇంచార్జి , తెలంగాణ కోరుకోమిటి సభ్యులు,మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు ..శనివారం ఆయన ఖమ్మం , నల్గొండ లోకసభ నియోజకవర్గాల రోడ్ షోలలో పాల్గొని , శానంపూడి సైదిరెడ్డి, తాండ్ర వినోదరావులకు మద్దతుగా జరిగిన ర్యాలీల్లో పాల్గొన్నారు …సూర్యాపేటలో ఆయనతోపాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొని ప్రసంగించారు …దేశగతిని ప్రగతి పధంలో నడిపించాలంటే మోడీ లాంటి సమర్థ ప్రధాని అవసరం ఉందని అన్నారు …ఆయన డైనమిక్ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకొని పోతుందని పేర్కొన్నారు …బీజేపీ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉందని ,తెలంగాణ లో ప్రధాని మోడీ , హోమ్ మంత్రి అమిత్ షా పర్యటనలతో జోష్ పెరిగిందని అన్నారు …తెలంగాణాలో అధికార కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలన, వైఫల్యాలు, తప్పుడు సమాచార ప్రచారాన్ని బట్టబయలు చేశారు, అలాగే బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి పాలనను విమర్శించారు.

సూర్యాపేట, రోడ్‌షో, ర్యాలీలో కూటమి పార్టీల మద్దతుతో బిజెపి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని ఓటర్లను సుధాకర్ రెడ్డి అభ్యర్థించారు . బిజెపికి ఓటు వేస్తే అభివృద్ధికి జరుగుతుందని అన్నారు. సుపరిపాలన, భద్రత, జాతీయ సమగ్రత కోసం బీజేపీని గెలిపించాలని అన్నారు … మాజీ శాసనసభ్యులు వెంకటేశ్వర్ రావు , గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాగ్యరెడ్డి, బీజేవైఎం జాతీయ కోశాధికారి పీఎం సాయిప్రసాద్, ఇతర స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనలపై కాంగ్రెస్ ప్రకటన

Ram Narayana

 ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమే: రేవంత్ రెడ్డి

Ram Narayana

రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

Ram Narayana