తెలంగాణ వార్తలు

ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కేసు… పోలీసుల అదుపులో నిందితుడు ..

  • ప్రజాభవన్ పేలబోతుందంటూ నిన్న ఫోన్ చేసిన శివరామకృష్ణ
  • భవనాన్ని జల్లెడ పట్టి ఫేక్ కాల్‌గా గుర్తించిన పోలీసులు
  • నిందితుడు మద్యం మత్తులో ఫోన్ చేసినట్లుగా గుర్తించిన పోలీసులు

ప్రజాభవన్‌కు వచ్చిన బాంబు బెదిరింపు కేసులో పంజాగుట్ట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్‌లో బాంబు పెట్టామని.. కాసేపట్లో పేలబోతుందని నిన్న పోలీసులకు ఫోన్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు ప్రజాభవన్‌ను జల్లెడ పట్టారు. రెండు గంటలకు పైగా తనిఖీలు చేసి… ఫేక్ కాల్‌గా గుర్తించారు.

ఈరోజు నిందితుడు శివరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం సేవించి కంట్రోల్ రూంకు ఫోన్ చేసినట్లు గుర్తించారు. శివరామకృష్ణ ముషీరాబాద్‌లో ఉంటున్నాడు. అతనిని గుంటూరు జిల్లా వాసిగా గుర్తించారు.

Related posts

తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ లోకుర్ …

Ram Narayana

జగద్గిరిగుట్టలో ఘోరం… దివ్యాంగురాలిని చంపేపి, ఆత్మహత్యాయత్నం చేసిన ముగ్గురు కుటుంబ సభ్యులు

Ram Narayana

14 కిలోమీటర్ల ఎస్సెల్బీసీ టన్నెల్ లో చివరి 50 మీటర్లు ఆటంకం ..మంత్రి ఉత్తమ్

Ram Narayana