Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు ఫలప్రదం అయ్యాయి: ప్రధాని మోదీ

  • రష్యాలో మోదీ పర్యటన
  • నేడు మాస్కోలో పుతిన్ తో సమావేశం
  • పుతిన్ తో కలిసి ఆటమ్ పెవిలియన్ సందర్శన

ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలు జరిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం ఫలప్రదంగా జరిగిందని మోదీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

వాణిజ్యం, భద్రత, వ్యవసాయం, టెక్నాలజీ, ఆవిష్కరణలు తదితర రంగాలపై నిర్మాణాత్మక చర్చలు జరిపామని తెలిపారు. ప్రజల మధ్య నేరుగా సంబంధాల వృద్ధికి, అనుసంధానత పెంపుదలకు అధిక ప్రాధాన్యతనిచ్చామని మోదీ వివరించారు. 

రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని ప్రఖ్యాత ఆటమ్ పెవిలియన్ ను పుతిన్ తో కలిసి సందర్శించినట్టు మోదీ వెల్లడించారు. భారత్, రష్యా మధ్య సహకారానికి ఇంధన రంగం మూలస్తంభం వంటిదని తెలిపారు. ఈ రంగంలో ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతం చేసుకునేందుకు మరింత ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు.

భావితరాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే శాంతి చాలా ముఖ్యమని, అయితే, యుద్ధాల ద్వారా శాంతి లభించదని స్పష్టం చేశారు. యుద్ధాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభించవని… బాంబులు, తుపాకీ మోతల మధ్య జరిగే చర్చలు ఫలించవని అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా శాంతిస్థాపనకు ప్రయత్నించాలని మోదీ ఓ సందేశంలో పేర్కొన్నారు.

Related posts

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. తుపాకీతో రెచ్చిపోయిన టీనేజర్!

Ram Narayana

చంద్రుడిపై రైళ్లు.. నాసా ప్రణాళికలు రెడీ…

Ram Narayana

భారతీయ విద్యార్థులకు షాక్.. ఎయిర్‌‌పోర్టు నుంచే వెనక్కు పంపించేసిన అమెరికా

Ram Narayana

Leave a Comment