Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ప్రతిదీ ఫ్రీగా కావాలంటే అంటే ఎలా …టీయూడబ్ల్యూజే సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి!

ప్రతిదీ ఫ్రీగా కావాలంటే ఎలా …మనకంటే పేదలు ఇప్పటికి తిండి దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు ..వాళ్లకు లేని ఫ్రీ నీకు ఎలా ఇస్తారు …ఇది న్యాయమా అని ..? ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు , తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి అన్నారు .. దేశం అంతా తిరుగుతాను ఫ్రీ బస్సు పాస్ కలవాలని అడగటం సముచితం కాదన్నారు … అన్ని అడుగుదాం కాని అడిగేందుకు ఏది అడగాలి ,ఏది అడగకూడదు అనే విచక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు …మన కోర్కెలు చాల ఉన్నాయి ..వాటిని సాధించుకోవాలంటే మన బలం నిరూపించుకోవాల్సిందే … ఐక్యత సంఘటిత శక్తితోనే ఏదైనా సాదించుకోగలం …కొంతమంది రేవంత్ రెడ్డి సర్కార్ మనకు అనుకూలంగా ఉంది మన నాయకుడు మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నారు .. మనకు అన్ని వస్తాయని అనుకుంటే భ్రమే అవుతుందన్నారు … మార్గాలు ఏవైనా మన వాయిస్ వినిపించకుండా ఏది సాధించుకోవడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలని యూనియన్ నేతలకు దిశానిర్ధేశం చేశారు …సోమవారం హైద్రాబాద్ లోని యూనియన్ కార్యాలయం దేశోద్ధారక భవనంలో జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) రాష్ట్ర విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు …ఒక జిల్లాకు చెందిన నేత సార్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు …మనకు కూడా గో స్టేట్ ఫ్రీ బస్సు చేస్తే బాగుంటుందని అందుకు యూనియన్ కృషి చేయాలనీ అనడంపై ఆయన స్పందించారు .. ఇది సముచితం కాదు …నీవు ఎక్కడకు వెళ్ళాలి జిల్లాలో తిరగడానికే కదా ..? అందుకోసం ఇప్పటికే జిల్లా ఫ్రీ బస్సు పాస్ ఉంది ..స్టేట్ కు 1 /3 ఉంది అంతకంటే నీకు ఏమి కావాలి …న్యూస్ పర్పస్ వార్తలకు వెళ్లేందుకు ఉపయోగించాలి కాని అది జరుగుతుందా అంటే లేదు … ఉన్నచోట ఉద్యోగం వదులుకొని రాష్ట్రమంతా ఫ్రీగా తిరగలేము కదా …? ఇది పెట్టేటప్పుడే దీనిపై చాల చర్చలు జరిగి చివరికి యూనియన్ చేసిన కృషి ఫలితంగా జర్నలిస్టులకు ఆమాత్రం రాయితీలు దక్కాయన్నారు …ఇది మనం పోరాడి సాదించుకున్నదేనన్నారు . రాష్ట్రంలో జర్నలిస్టుల ఇళ్లస్థలాలు ,హెల్త్ కార్డులు ,అక్రిడేషన్ కార్డులపై జరుగుతున్న కసరత్తుకు సీఎంతో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో మన కోర్కెలపై సానుకూలత ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు ..

ఇటీవల హైద్రాబాద్ లో జర్నలిస్టులకు హౌస్ సైట్స్ అందించేందుకు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం యూట్యూబ్ లమీద మాట్లాడటం పై చర్చలు జరుగుతున్నాయి …దీనిలో మంచి చెడు రెండు ఉన్నాయి…సీఎం మాటలను ఏ కోణంలో చూసేవాళ్ళు ఆకోణంలో చూస్తారు ..ఏది మంచి ఏది చెడు అనేది చివరగా పౌరసమాజం నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డారు ..భావస్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తామంటే కుదరదని అన్నారు .. భావస్వేచ్ఛకు స్వీయనియంత్రణ అవసరమన్నారు .. ఏది వార్త ఏది వార్త కాదు అనేది నిర్ణయించాల్సింది ఎవరు ..? అంతిమంగా ఎవరికీ ఉపయోగపడాలి సమాజానికి , నోరు ఉన్నా తమ వాయిస్ వినిపించలేని నీరు పేదలకు వాయిస్ లెస్ పీపుల్స్ వాయిస్ గా ఉండాలి .. అది జరుగుతుందా లేదా అని ప్రశ్నించుకోవాలి …మీడియా ఎవరి చేతుల్లో ఉంది ….ఎవరికీ ఉపయోగపడుతుంది అనేదానిపైనా కూడా చర్చ జరుగుతుందన్నారు ..

మీడియా అనేది మంచి సమాజం కోసం, అణగారిన వర్గాల తరుపున ,అన్యాయాలకు గురైయ్యేవారికి అండగా న్యాయం కోసం ప్రశ్నించే వారికీ ఆయుధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు …సోషల్ మీడియా, డిజిటల్ మీడియా , యూట్యూబ్ ఛానల్స్ సమాజం పై పెద్ద ప్రభావాన్ని చూపుతున్న విషయాన్నీ విస్మరించరాదన్నారు .అదే సందర్భంలో వారు ఉపయోగిస్తున్న భాష జుగుస్సాకరంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. స్వీయనియంత్రణ పాటించాలన్నారు . చాలామంది సీనియర్లు నడుపుతున్న యూట్యూబ్ చానళ్ళుకు , డిజిటల్ మీడియాకు కచ్చితంగా గుర్తింపుతోపాటు అక్రిడేషన్ లు ఇవ్వాలని అన్నారు

టీవీ ఛానల్స్ వారు ప్రచారం చేసే వార్తలపై అభ్యంతరాలకు అంబుడ్స్ మెన్ ఏర్పాటు చేసుకున్నారని అయితే ఒక ఛానల్ అదే పనిగా చేసిన ఒక వార్త ప్రసారంపై తిరిగి అదేస్థాయిలో ఆవార్త పొరపాటే అంటూ ప్రసారం చేయాలని చెపితే ఆ టీవీ ఛానల్ అంబుడ్స్ మెన్ నుంచి వైదొలిగిన విషయాన్నీ ఈ సందర్భంగా గుర్తు చేశారు .. సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షులు కె .విరాహత్ అలీ మాట్లాడుతూ త్వరలో జరగనున్న సీఎంతో జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున తరలి రావాలని అన్నారు …సమావేశంలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ ,ఐజేయూ కార్యవర్గ సభ్యులు కె .సత్యనారాయణ ,నగునూరి శేఖర్ ,ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ ఉపప్రధాన కార్యదర్శి కె .రాములు ,రాష్ట్ర ఆఫీస్ బేరర్లు , కార్యవర్గ సభ్యులు , వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు , ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు …

సీఎం తో ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులను సమీకరించాలని సమావేశం నిర్ణయించింది …జర్నలిస్ట్ ఉద్యమ చరిత్రలో గొప్ప సమీకరణగా ఇది నిలిచి పోతుందని సమావేశం అభిప్రాయపడింది …

Related posts

మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జైజై లు పలుకుతున్నజర్నలిస్ట్ సమాజం!

Ram Narayana

బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందన!

Drukpadam

ఎన్నికల స్టంట్ అనుకోండి!: ఆర్టీసీ విలీనంపై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment