Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సైన్సు అండ్ టెక్నాలజీ

భూమిపై కొవిడ్ లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

  • లాక్‌డౌన్ సమయంలో భూమిపై ఆగిపోయిన కార్యకలాపాలు
  • ఆ ప్రభావం చంద్రుడిపైనా పడిందన్న శాస్త్రవేత్తలు
  • మనకు కనిపించే చంద్రుడి ఉపరితలంపై 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతల తగ్గుదల

ప్రపంచమంతా కరోనా లాక్‌డౌన్ మధ్య గది గోడలకే పరిమితమైన వేళ చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కొవిడ్-19 ప్రపంచాన్ని క్రమంగా కబళిస్తుండడంతో తొలుత చైనా లాక్‌డౌన్ విధించింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఒక్కొక్కటిగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఫలితంగా అన్ని వ్యవస్థలు స్తబ్దుగా మారిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోగా, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీంతో గ్రీన్‌హౌస్ ఉద్గారాల విడుదల పూర్తిగా ఆగిపోయింది. 

ఇక ఈ ప్రభావం చంద్రుడిపైనా పడినట్టు అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ (పీఆర్ఎల్)కు చెందిన శాస్త్రవేత్తలు కె.దుర్గాప్రసాద్, జి.అంబ్లీ నిర్వహించిన అధ్యయనంలో వెలుగుచూసింది. ఈ అధ్యయన వివరాలు పీర్ రివ్యూడ్ జర్నల్ ‘మంత్లీ నోటీసెస్ ఆఫ్ రాయల్ అస్ట్రోనామికల్ సొసైటీ: లెటర్స్’లో ప్రచురితమయ్యాయి. 2020 ఏప్రిల్-మే మధ్య లాక్‌డౌన్ సమయంలో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయినట్టు అధ్యయనం పేర్కొంది. నాసాకు చెందిన లూనార్ రీకనాయిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్‌వో) డేటాను విశ్లేషించగా ఈ విషయం బయటపడింది. 
అధ్యయనం ఎలా చేశారు?
చంద్రుడిపై మనకు కనిపించే భాగంలోని ఆరు ప్రత్యేక ప్రాంతాల్లోని ఉపరితలంలో రాత్రివేళ ఉష్ణోగ్రతలను అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరంగా అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే లాక్‌డౌన్ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత 8 నుంచి 10 (డిగ్రీలు) కెల్విన్ (కే) పడిపోయినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా 2017 నుంచి 2023 వరకు డేటాను విశ్లేషించారు. లాక్‌డౌన్ సమయంలో వచ్చిన మార్పుల కారణంగా భూమి నుంచి వేడి గణనీయంగా తగ్గడమే అందుకు కారణమని పేర్కొన్నారు.

Related posts

జుపిటర్ మీదా బతికేద్దాం.. రూ. 43,700 కోట్లతో నాసా వ్యోమనౌక ప్రయోగం..!

Ram Narayana

చందమామపై బయటపడ్డ భారీ బిలం.. ప్రగ్యాన్ రోవర్ పరిశోధనలో గుర్తింపు!

Ram Narayana

ప్రేమ మెదడును వెలిగిస్తుందంటున్న శాస్త్రవేత్తలు

Ram Narayana

Leave a Comment