Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రికెట్ వార్తలు

నిన్న హీరోలు నేడు జీరోలు …46 పరుగులకే కుప్పకూలిన భారత్

బెంగ‌ళూరు టెస్టు… కివీస్ బౌల‌ర్ల విజృంభ‌ణ‌… 46 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్‌

  • బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్‌, న్యూజిలాండ్ తొలి టెస్టు
  • భార‌త బ్యాట‌ర్లలో ఐదుగురు డ‌కౌట్
  • 5 వికెట్లతో భార‌త ఇన్నింగ్స్‌ను శాసించిన‌ మాట్ హెన్రీ

మొన్న పొట్టి ప్రపంచ కప్ ,బాంగ్లాదేశ్ పై పొట్టి క్రికెట్ ,టెస్టుల్లో వాష్ అవుట్ చేసిన ఇండియా హీరోలో నేడు జీరోలు అయ్యారు ..ఉత్తమ చెత్త ప్రదర్శనతో ఇదేం అవుతారా బాబు అనిపించుకున్నారు …గల్లీ క్రికెట్ ఆడవాళ్లు సైతం మన హీరోల ఆట చూసి ముక్కున వేలేసుకుంటున్నారు … నిన్నటి నుంచి న్యూజీలాండ్ తో బెంగుళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో ప్రారంభమైన టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో మన జట్టు ఘోరంగా విఫలమైంది …విరాట్ కోహ్లీ తో సహా నలుగురు బ్యాట్స్ మెన్స్ డకవుట్ అయ్యారు ..

బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కుప్ప‌కూలింది. టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియాను కివీస్ బౌల‌ర్లు వ‌ణికించారు. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్లు విజృంభించ‌డంతో భార‌త జ‌ట్టు భోజ‌న విరామానికి 34 ప‌రుగుల‌కే 6 వికెట్లు పారేసుకుంది. ఆ త‌ర్వాత కూడా భార‌త్ ఇన్నింగ్స్ గాడిలో ప‌డ‌లేదు. దాంతో 46 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. 

భార‌త బ్యాట‌ర్లలో ఐదుగురు డ‌కౌట్ అయ్యారు. కోహ్లీ, స‌ర్ఫ‌రాజ్‌, కేఎల్ రాహుల్‌, ర‌వీంద్ర జ‌డేజా, అశ్విన్ ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరారు. మ‌ధ్య‌లో య‌శ‌స్వి జైస్వాల్ (13), రిష‌భ్ పంత్ (20) ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. 

పంత్ ఔట్ కావ‌డంతో రోహిత్ సేన 39 ప‌రుగుల‌ వద్ద 8వ వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత 31.2 ఓవ‌ర్ల‌లో 46 ర‌న్స్‌కే చెతులెత్తేసింది. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ 5 వికెట్లు తీయ‌గా… విలియం ఓ రూర్కే నాలుగు వికెట్ల‌తో భార‌త ఇన్నింగ్స్‌ పతనంలో తన వంతు పాత్ర పోషించాడు.

Related posts

హైదరాబాద్‌ టీ20లో రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టిన సంజూ శాంసన్!

Ram Narayana

అతిగా మద్యం తాగి ఆసుపత్రి పాలైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్

Ram Narayana

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ నయా రికార్డు…

Ram Narayana

Leave a Comment