- లగచర్ల ఫార్మాపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై రైతుల దాడి
- ఆ తర్వాత రైతుల అరెస్టులతో ఆందోళనకర పరిస్థితులు
- అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన బాటపట్టిన బాధితులు
- ఎన్‌హెచ్‌ఆర్‌సీని కూడా ఆశ్రయించిన వైనం
లగచర్ల భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భూసేకరణ నిలిపివేస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. లగచర్ల ఫార్మాపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై రైతుల దాడి ఘటన తర్వాత అర్ధరాత్రి అరెస్టులు, పోలీసుల మోహరింపులతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాధితులు అరెస్టులకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఎన్‌హెచ్‌ఆర్‌సీ దీనిపై విచారణ చేపట్టింది. ఇలాంటి సమయంలో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గడం గమనార్హం.