సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం.
జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 31 రోజున విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు.
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డీజే లు,అధిక శబ్దం వచ్చే బాక్స్ లు వినియోగిస్తే ఉపేక్షించేది లేదు..
మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రజలకు సూచించారు.నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ జిల్లా పరిధిలోని ప్రజలు ప్రశాంతమైన వాతవరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీస్ శాఖ తరుపున భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.
డిసెంబర్ 31 రోజున జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనీఖీలు నిర్వహించబడుతాయని,నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ఎర్పాటు చేసే ఎలాంటి కార్యక్రమాలు అయన సరే నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తు అనుమతులు తీసుకోవాలని,అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా నిబంధనలకు విరుద్ధంగా డిజేలు,అధిక శబ్దం వచ్చే బాక్స్ లు ఏర్పాటు చేస్తే ఉపేక్షించేది లేదని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు*.
పోలీసుల వారి సూచనలు, నిబంధనలు….
డిసెంబర్ 31వ తేదీన టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
డిసెంబర్ 31వ తేదీన జిల్లా వ్యాప్తంగా డీజే లు నిషేధం,నిబంధనలు విరుద్ధంగా వినియోగిస్తే సీజ్ చేసి,కేసులు నమోదు చేస్తాం.
మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం.వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతోపాటు జైలు శిక్ష విధించబడుతుంది.
ప్రభుత్వ,ప్రవేట్ ఆస్తులపై,రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టినా, అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.
మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా౦.
న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో మూసివేయాలి. మైనర్లకు మద్యం అమ్మకూడదు.
బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుంది
మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి వల్ల ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే వారి సంరక్షకుల పైన కేసులు నమోదు చేస్తాం.
పై అంక్షలను ఎవరైన అతిక్రమించినా, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని,ఈ వేడుకలను ప్రజలు,యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.
అదేవిధంగా 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ,జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు…
నకిలీ రిపోర్టర్ల పై చర్యలు తీసుకోవాలి
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారికి కొత్తగూడెం జర్నలిస్టుల వినతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రిపోర్టర్లమంటూ చలామణి అవుతున్న నకిలీలపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారికి కొత్తగూడెం జర్నలిస్టులు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు.ఇటీవల కాలంలో జిల్లా కేంద్రమైన కొత్తగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు యూట్యూబ్, పిడిఎఫ్,నాన్ రికగ్నైజ్డ్ పత్రికలు వంటి సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకొని రిపోర్టర్లంటూ ముసుగు ధరించి తిరుగుతూ వ్యాపారస్తులు,కాంట్రాక్టర్లు,సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి పట్ల దృష్టి సారించి కఠినమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు జిల్లా ఎస్పీని కోరారు.అదేవిధంగా జిల్లా ప్రెస్ క్లబ్ పేరుతో ఈ నకిలీ విలేకరులు వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ.. ఇకపై నకిలీ రిపోర్టర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.నిజమైన జర్నలిస్టులు ఆధారపురితంగా అవినీతి,అక్రమాలపై వార్తా కథనాలు ప్రచురించి సమాజానికి మేలు చేసేవారని,కానీ కొందరు నకిలీ జర్నలిస్టుల వల్ల అసలైన జర్నలిస్టులకు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఇకపై ఎవరైనా అనుమతి లేని యూట్యూబ్, పిడిఎఫ్, నాన్ రికగ్నైజ్డ్ పత్రికల పేర్లతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ గారు హెచ్చరికలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఇమంది ఉదయ్ కుమార్,పండుగ రేశ్వంత్,చావా పాపారావు,నరసింహారావు,ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు.