తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ!

  • రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
  • ఉపాధ్యాయ స్థానాలకు సర్వోత్తమ్ రెడ్డి, మల్కా కొమురయ్య పేర్ల ప్రకటన
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేరు ప్రకటన

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.

నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సర్వోత్తమ్ రెడ్డి (వరంగల్), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమురయ్య (పెద్దపల్లి), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీ అంజిరెడ్డి (సంగారెడ్డి)ని ఎంపిక చేసినట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు.

Related posts

రేపు లేదా ఎల్లుండి మిగతా అభ్యర్థుల జాబితా: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

Ram Narayana

నేను కూడా సీఎం అవుతా… ఒక్కొక్కరి తోలు తీస్తా: కవిత

Ram Narayana

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై తీవ్రం వ్యాఖ్యలు చేసిన కవిత..!

Ram Narayana