అంతర్జాతీయం

అమెరికా నుంచి మరో రెండు విమానాల్లో భారత్ కు అక్రమ వలసదారులు …!

అమెరికాలో అక్రమ వలసదారుల అంశంపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గొలుసులతో బంధించి మరీ అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిప్పి పంపిస్తున్నారు. కొన్నిరోజుల కిందటే 104 మంది భారతీయులను కూడా అమెరికా ప్రభుత్వం సైనిక రవాణా విమానంలో పంపించి వేసింది.

మన ప్రధాని అమెరికాలో ఉండగానే అమెరికా నుంచి మరో రెండు విమానాలు అక్రమ వలసదారులతో భారత్ చేరుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు …ఇప్పటికే ఒక విమానం బయలుదేరగా , మరో విమానం కొన్ని గంటల్లో బయలుదేరనున్నది ..

తాజాగా, మరో 200 మంది అక్రమ వలసదారులను అమెరికా ప్రభుత్వం భారత్ కు పంపించనుంది. అక్రమ వలసదారులతో కూడిన రెండు విమానాలు భారత్ చేరుకోనున్నాయి. ఈ నెల 15న ఒక విమానం, ఈ నెల16న మరో విమానం భారత్ చేరుకుంటాయి.

Related posts

11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడపగా పక్కనే మందుకొట్టిన తండ్రి.. కూలిపోయిన విమానం

Ram Narayana

భగ్గుమన్న పాక్-ఆఫ్ఘన్ వైరం.. తెరపైకి భారత్ పేరు తెచ్చిన పాకిస్థాన్!

Ram Narayana

జనాభా పెంచేందుకు చైనా తాజా నిర్ణయం.. కండోమ్‌లపై 13 శాతం పన్ను

Ram Narayana