తాను కొందరికి నచ్చవచ్చు మరికొందరికి నచ్చకపోవచ్చు …సీఎం రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
టెన్ జన్‌పథ్‌లో పార్టీ అగ్రనేతను కలిసిన రేవంత్ రెడ్డి
తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై చర్చించిన నేతలు
సూర్యాపేట సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
ఎప్పటికీ వేలెత్తి చూపించే పరిస్థితిని తెచ్చుకోనని వ్యాఖ్య
కొంతమంది తనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని ఆవేదన
తలసాని, సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీ బీఫాంపై గెలిచి.. ఎవరి హయాంలో మంత్రులయ్యారని ప్రశ్న
ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన ముఖ్యమంత్రి
రేరేవంత్ రెడ్డి ఉరుకులు పరుగులు పెట్టె ముఖ్యమంత్రి …తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో అనేక కార్యక్రమాలు తీసుకోని ముందుకు వెళ్ళుతున్నారు …అయితే రాష్ట్రంలో ఆర్ధికపరిస్థితులు ఆయన అనుకున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాల అమలుకు అనుకూలించేవిగా లేవు దీంతో ఇచ్చిన వాగ్దానాలపై సహజంగానే విపక్షాల నుంచి వస్తున్న విమర్శలపై ఆయన నొచ్చుకుంటున్నారు …తాను నిస్వార్థంగా పనిచేస్తున్నప్పటికీ విమర్శలు ఏమిటని మదన పడుతున్నారు…ఇటీవల కులగణనపై విమర్శలు వచ్చాయి…తర్వాత కొద్దీ రోజులకు అప్పట్లో మిగిలి పోయిన వారి గణనకు నిర్ణయం తీసుకున్నారు…బీసీ లెక్కలు తప్పుల తడక అని బీజేపీ ,బీఆర్ యస్ లు విమర్శలు గుప్పిస్తున్నాయి… ఆ పార్టీల వారే కులగణనలో పాల్గొనకపోవడాన్ని సీఎం అసెంబ్లీలో ఎత్తి చూపారు ..తాను రెడ్డి సీఎం గా చివరి వాణ్ణి అయినా పర్యలేదని అన్నారు…ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో మీడియాతో జరిపిన చిట్ చాట్ లో తాను కొందరికి నచ్చవచ్చు ,మరికొందరికి నచ్చకపోవచ్చు ,ముఖ్యమంత్రిగా కూడా కొందరు అంగీకరించకపోవచ్చు అని ఒకింత నిర్వేదంగా మాట్లాడారు …సీఎం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది …
ఈ సందర్భంగా మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు … తాను అందరికీ నచ్చాలనేమీ లేదని, కొందరికి నచ్చవచ్చు, ఇంకొందరికి నచ్చకపోవచ్చని అన్నారు. తనను ముఖ్యమంత్రిగా కూడా కొందరు అంగీకరించకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఎవరూ వేలెత్తి చూపే పరిస్థితి తెచ్చుకోనని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు తననే ప్రశ్నిస్తారని ఆయన అన్నారు. ఇచ్చిన ప్రతి గ్యారెంటీని తప్పకుండా అమలు చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు. కొందరు తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వారు అంతకు మించి ఏమీ చేయలేరని ఆయన అన్నారు. విమర్శలను పట్టించుకుంటే తాను ముందుకు వెళ్లలేనని ముఖ్యమంత్రి అన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ప్రస్తావిస్తూ, గతంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ బీఫారంపై గెలిచారో, ఆ తర్వాత ఏ పార్టీలో చేరారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వారు ఎవరి హయాంలో మంత్రులయ్యారో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పాలని ఆయన నిలదీశారు. మంత్రివర్గ విస్తరణ తన ఒక్కడి నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో పార్టీ అగ్రనేతను ముఖ్యమంత్రి కలిశారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై వారి మధ్య చర్చ జరిగింది. తెలంగాణలో నిర్వహించిన కుల గణన అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చింది. కుల గణన, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు, తదనంతర పరిణామాలపై చర్చించారని సమాచారం.
పీసీసీ కార్యవర్గ కూర్పుపై కూడా రాహుల్ గాంధీతో చర్చించారని సమాచారం. త్వరలో సూర్యాపేట, గద్వాలలో బహిరంగ సభలను నిర్వహిస్తున్నామని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు.