తెలంగాణ వార్తలు

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి!

  • యూఎస్‌లో ఎంఎస్ చ‌దువుతున్న గంప ప్ర‌వీణ్
  • రంగారెడ్డి జిల్లా కేశంపేట ప్ర‌వీణ్ స్వస్థలం
  • ఉన్న‌త చ‌దువుల కోసం గ‌తేడాది అమెరికాలోని మిల్వాంకి విస్కాన్సిన్ సిటీకి యువ‌కుడు

తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన గంప ప్ర‌వీణ్ (27) అనే యువ‌కుడు అమెరికాలో అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందాడు. గంప రాఘ‌వులు, గంప ర‌మాదేవీల కుమారుడైన ప్ర‌వీణ్ గ‌తేడాది ఎంఎస్ చేయ‌డానికి అమెరికాలోని మిల్వాంకి విస్కాన్సిన్ సిటీకి వెళ్లాడు. అక్క‌డ ఎంఎస్ రెండ‌వ‌ సంవ‌త్స‌రం చ‌దువుతున్న అత‌డు.. స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. 

అయితే, అత‌డు నివాసం ఉండే ఇంటి స‌మీపంలో కాల్పులు చోటుచేసుకోగా వాటిలో ప్ర‌వీణ్ ప్రాణాలు కోల్పోయిన‌ట్లు కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

Related posts

జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి…టీయూడబ్ల్యూజే

Ram Narayana

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యలో కొత్త కోణం .. స్వేచ్ఛ తండ్రి సంచలన ఆరోపణలు

Ram Narayana

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా వేస్ట్… రాజీనామా చేయాలి: కవిత

Ram Narayana