తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

రూ. 3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్…

  • శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
  • సభలో ఉప ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రసంగం
  • రాష్ట్ర సుస్థిర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని వ్యాఖ్య

తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2025-26 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రూ.3,04,965  కోట్లతో బడ్జెట్ కు రూపకల్పన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ భట్టి విక్రమార్క ప్రసంగించారు. తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ పాలనను అందిస్తున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నామని, విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అన్నదాతల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని వివరించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన ‘నీకు కనిపించిన బలహీనులైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో.. నువ్వు తీసుకున్న చర్య అతడికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో’ అనే మాటలను పాటిస్తూ తమ ప్రభుత్వం ముందుకెళుతోందని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా ప్రయోజనాలు, ప్రజలకు జవాబుదారీతనం.. సుపరిపాలన అందించడంలో సఫలీకృతమయ్యామని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని, ప్రజలు అప్పగించిన బాధ్యతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాము తాకట్టు పెట్టలేదన్నారు.

 తెలంగాణ బడ్జెట్ లో ఏ రంగానికి ఎంతంటే..?

Telangana Budget Key Highlights


తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఏడాదికి రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ను రూపొందించారు. ఇందులో కీలక రంగాలకు కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి..

వ్యవసాయ శాఖకు – రూ.24,439 కోట్లు
పశుసంవర్ధక శాఖకు – రూ.1,674 కోట్లు
నీటిపారుదల – రూ.23,373 కోట్లు
అడవులు-పర్యావరణం – రూ.1,023 కోట్లు
రైతు భరోసా – రూ.18 వేల కోట్లు
వైద్యారోగ్యం – రూ.12,393 కోట్లు
విద్యుత్‌ – రూ.21,221 కోట్లు
ఉపాధి కల్పన – రూ.900 కోట్లు
విద్య – రూ.23,108 కోట్లు
ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల కోసం రూ.11,600 కోట్లు

పారిశ్రామిక రంగం – రూ.3,525 కోట్లు
పౌర సరఫరాల శాఖ – రూ.5,734 కోట్లు
హోంశాఖ – రూ.10,188 కోట్లు
శాంతిభద్రతలు – రూ.10,188 కోట్లు

వివిధ శాఖలకు..
ఆర్‌ అడ్‌ బీ – రూ.5,907 కోట్లు
పర్యాటక రంగం – రూ.775 కోట్లు
పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి – రూ.31,605 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి – రూ.17,677 కోట్లు
హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్‌ – రూ.150 కోట్లు
చేనేత – రూ.371 కోట్లు, ఐటీ – రూ.774 కోట్లు
సాంస్కృతిక రంగం – రూ.465 కోట్లు
దేవాదాయ, ధర్మాదాయ శాఖ – రూ.190 కోట్లు
క్రీడలు – రూ.465 కోట్లు

సంక్షేమం కోసం ఇలా..
స్త్రీ, శిశు సంక్షేమం – రూ.2,861 కోట్లు
మహిళా, శిశు సంక్షేమానికి – రూ. 2,862 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
మైనార్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లకు – రూ.22,500 కోట్లు
గృహజ్యోతి, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్‌ కోసం – రూ.3 వేల కోట్లు

Related posts

తెలంగాణ పరిస్థితికి చావుడప్పు కొట్టాలి ..కానీ డీజే కొట్టినట్లుగా ఉందన్న కేటీఆర్

Ram Narayana

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని చూస్తున్నారు: కేటీఆర్

Ram Narayana

ఏ హోదాతో హరీశ్ రావు మాట్లాడుతున్నారు?: కోమటిరెడ్డి

Ram Narayana