తెలంగాణ వార్తలు

నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం….. మంత్రి పొంగులేటి

పేదలకు అందించే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగు తుందని, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.బుధవారం మంత్రివర్యులు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ రామన్నపేటలో మునిసిపల్ సాధారణ నిధులు కోటి రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, ఖమ్మం రూరల్ మండలంలో పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దారేడు నుంచి కోటపాడు వరకు 4 కోట్ల 90 లక్షల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని, దారేడు నుంచి కోయచిలకకు 3 కోట్ల 74 లక్షలతో బీటి రోడ్డు మంజూరు చేశామని అన్నారు. దారెడు గ్రామానికి మొత్తం 8 కోట్ల రూపాయలతో రెండు రోడ్లను ఇందిరమ్మ ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. మద్దివారి గూడెం నుండి పోలిశెట్టి గూడెం వరకు 3 కోట్ల 30 లక్షలతో నిర్మించనున్న 2 కిలో మీటర్ల బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని, వారం రోజులలో పనులు ప్రారంభం అవుతాయని, నాణ్యతతో కూడిన పనులు సకాలంలో పూర్తి చేయాలని మంత్రి అన్నారు. తీర్థాల నుండి మద్దివారిగూడెం వరకు 4 కోట్ల 29 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమాంతరంగా అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి నెలా గత పాలకులు చేసిన అప్పులకు 6 వేల 500 కోట్ల రూపాయల కిస్తీ చెల్లిస్తూ, గత పాలకులు అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు ఇచ్చిన ఒక్కో హామి అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉగాది నుండి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల జారీ, రేషన్ కార్డులలో కొత్త సభ్యుల చేరిక, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏడాది కాలంలోనే దాదాపు 21 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు. రైతు భరోసా పథకం క్రింద పెట్టుబడి సహాయం ఎకరానికి 10 వేల నుంచి 12 వేల రూపాయలకు పెంచామని అన్నారు. 22 వేల 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల కోసం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉంటుందని, నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కొనసాగుతుందని, 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ నరసింహారావు, ఖమ్మం రూరల్ తహసిల్దార్ రాంప్రసాద్, ప్రజాప్రతినిధులు, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • రాజకీయాలకతీతంగా నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
  • ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు
    ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీలో మంత్రి పొంగులేటి

అర్హులైన నిరుపేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.టి.సి.వి. రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంత లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి పంపిణీ చేసారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారుల ముఖాలలో ఆనందం చూస్తుంటే తాను భావోద్వేగానికి లోనయ్యానని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన అద్భుతంగా ఉంటుందని అన్నారు. గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ద పేద ప్రజల ఇండ్లపై పెట్ట లేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మరించిందని అన్నారు.రూ. 22 వేల 500 కోట్ల రూపాయలను పేద ప్రజల సొంతింటి కల కోసం ప్రజా ప్రభుత్వం ఈ సంవత్సరం కేటాయించిందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం అజెండాగా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం పెట్టె ప్రతి రూపాయి పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నా మని అన్నారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.గత పాలకులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, గురుకులాల్లో డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంపు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.

రైతులకు దాదాపు రూ. 21 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు. రైతు భరోసా పథకం క్రింద పెట్టుబడి సహాయం ఎకరానికి రూ. 12 వేల రూపాయలకు పెంచామని అన్నారు.ప్రస్తుతం ప్రజలకు అందించే ఇండ్లు మొదటి విడత మాత్రమేనని, ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉంటుందని, ఏదులాపురం మున్సిపాలిటీ లో ప్రస్తుతం 520 మందికి ఇల్లులు మంజూరు చేసినట్లు, ఇంకా అర్హులున్నారని, వారికి కూడా ఇస్తామని, నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కొనసాగుతుందని మంత్రి తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులు పలువురు మాట్లాడుతూ…. గత 10 సంవత్సరాల కాలంగా సొంతింటి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తమకు మంజూరు కాలేదని, ప్రజా ప్రభుత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహాయంతో తమకు ఇండ్లు మంజూరు కావడం సంతోషంగా ఉందని అన్నారు.

Related posts

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు…

Ram Narayana

ఛత్తీ‌స్​ గఢ్ విద్యుత్​ కొనుగోలు విషయంలో కేసీఆర్ కి నోటీసులు జారీ చేసిన కమిషన్…

Ram Narayana

పిల్లల అన్నంలో విషం కలిపి చంపేయండి.. సిబ్బందిని ఆదేశించిన వార్డెన్!

Ram Narayana