Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం .. ఎందుకంటే?

  • మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం
  • స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై పొంగులేటి ప్రకటనపై అభ్యంతరం
  • కేబినెట్‌లో చర్చించకుండా మాట్లాడటం సరికాదన్న పీసీసీ చీఫ్
  • ఒకరి శాఖపై మరొకరు మాట్లాడొద్దని హితవు
  • కోర్టు పరిధిలోని అంశాలపై జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సూచన

తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల అంశంపై మంత్రి పొంగులేటి చేసిన ప్రకటన పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. కీలకమైన అంశాలను మంత్రివర్గంలో చర్చించకుండా నేరుగా మీడియాతో మాట్లాడటం సరైన పద్ధతి కాదని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. పార్టీలో కూడా చర్చించకుండా ఇటువంటి ప్రకటనలు చేయడం తగదని ఆయన స్పష్టం చేశారు. ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశంపై మరో మంత్రి మాట్లాడటాన్ని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తప్పుబట్టారు. ఇది సరైన విధానం కాదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా న్యాయస్థానాల పరిధిలో ఉన్న సున్నితమైన అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్పందించాలని సూచించారు. మంత్రులు తమ శాఖల పరిధిలోని అంశాలపైనే దృష్టి సారించాలని, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. ముందుగా పార్టీలో గానీ, కేబినెట్‌లో గానీ చర్చించకుండా బహిరంగ ప్రకటనలు చేయడం వల్ల అనవసరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలు పార్టీకి, ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో మంత్రులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని ఆయన కోరారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్​ వస్తుందని తాను చెప్పలేదని మంత్రి సీతక్క స్పష్టత ఇచ్చారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడుంటాయో వారంలో స్పష్టత వస్తుందని అన్నానని అన్నారు. కేబినెట్​లో నిర్ణయం జరగకుండా నేనెలా చెబుతానని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు బహిరంగంగా ప్రకటన చేయడంపై ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు స్పష్టత వస్తుందని భావిస్తున్నానని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం, పార్టీ కట్టుబడి ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలో ఇవాళ స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

జైలుకు వెళ్లాలనే కుతూహలం కేటీఆర్​కు ఉంది : కవిత జైలుకు వెళ్లి రాగానే లిక్కర్​ కేసుపై దృష్టి మళ్లించేందుకు బీసీలు, మహిళలు, దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్​ కూడా సానుభూతి కోసమో, రెచ్చగొట్టడానికే జైలుకు వెళ్లాలని భావిస్తున్నట్లున్నారని అన్నారు. ప్రభుత్వం చట్టప్రకారమే వెళుతోంది ఎలాంటి కక్షలు లేవన్నారు. కక్ష సాధింపే అయితే ప్రభుత్వం రాగానే జైళ్లలో వేసే వాళ్లం కదా అని ప్రశ్నించారు. కక్షలు, కార్పణ్యాలు బీఆర్​ఎస్​ వాళ్లకే ఉంటాయని ధ్వజమెత్తారు. రేవంత్​ పౌరుషంతో మాట్లాడితే కేటీఆర్​ పొగరుతో మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహించారు. జైలుకు వెళ్లాలనే కుతూహలం కేటీఆర్​కే ఉన్నట్లు ఉందన్నారు

Related posts

నియంతృత్వ ధోరణిని తెలంగాణ సమాజం సహించదు: గవర్నర్ తమిళిసై

Ram Narayana

ప్యాకేజీలపై రేణుకాచౌదరి సెటైర్లు …ఎవరు ఇస్తున్నారంటూ ఎదురు ప్రశ్న…

Drukpadam

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట భేటీ

Ram Narayana

Leave a Comment