Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

మానసిక ప్రశాంతతకు.. దివ్య ఔషధం యోగా…ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

మానసిక ప్రశాంతతకు.. దివ్య ఔషధం యోగా

  • ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి
  • లకారం ట్యాంక్ బండ్ వద్ద యోగా దినోత్సవానికి హాజరు
  • స్వయంగా యోగాసనాలు వేసి.. ఉత్సాహపరిచిన ఎంపీ

ఖమ్మం: మానసిక ప్రశాంతతకు, శారీరక ఉల్లాసానికి, మంచి ఆరోగ్యానికి యోగా.. దివ్య ఔషధం మాదిరిగా పనిచేస్తుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. శనివారం ఉదయం 6:30 గంటలకు ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. స్వయంగా యోగా ఆసనాలు వేసి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. యోగా అనేది ఆరోగ్యానికి ఒక క్రమశిక్షణాయుతమైన దినచర్య అని అన్నారు. మన దేశంలో ఆరంభమై..ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని తెలిపారు. మహిళలు సైతం ప్రత్యేక శ్రద్ధతో యోగా తరగతులు నిర్వహిస్తుండడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో యోగా క్లాసుల నిర్వాహకులు శ్రీలత, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, మహిళా నాయకురాలు చల్లా ప్రతిభారెడ్డి, కార్పొరేటర్లు, టీఏసీ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆనందమైన జీవితానికి యోగ అవసరమని పకృతి వైద్యులు సిద్దార్థ యోగ విద్యాలయం నిర్వాహకులు డాక్టర్ కే వై రామచంద్ర రావు అన్నారు .శనివారం యోగాడే ను పురస్కరించుకొని ఖమ్మం పట్టణంలో TNGOS ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన యోగ డే సెలబ్రేషన్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగ నిరంతరం జీవనం ప్రక్రియలో భాగంగా ఉండాలని అన్నారు .. యోగ ప్రాముఖ్యత ఖమ్మం నగరంలో విస్తరించి 40 కి పైగా సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు .చివరకు ఖమ్మం ఖిల్లాలపై కూడా యోగ చేసి దాన్ని ప్రదాని మోడీకి పంపిన నిర్వాహకుల పట్టుదలను కొనియాడారు .కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం కాపాడుకోవాలని గత 20 సంవత్సరాలుగా సిద్ధార్థ యోగ విద్యాలయం ద్వారా నాలుగు రాష్ట్రాల్లో యోగా సెంటర్లు ద్వారా ప్రజలకు మంచి చేసే అవకాశం దొరికింది గర్వంగా ఉందని డాక్టర్ రామచంద్రరావు అన్నారు.అనేక కేంద్రీయ సంస్థల నుంచి తమకు యోగ శిక్షణ ఇవ్వాలని అభ్యర్థనలు వస్తున్నాయని తెలిపారు . హైద్రాబాద్ లోని మొలిక్యులార్ బైయోలాజి , ఇక్రిశాట్ , శ్రీహరికోట ఏరోస్పేస్ , విశాఖపట్నం ,విజయవాడ , ఏపీ ,తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా తమను సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు . నేలకొండపల్లి సిద్దార్థ యోగ విద్యాలయానికి రోజు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా వందలాది మంది పేషంట్లు వస్తున్నారని వారికీ సలహాలు సూచనలు ఇవ్వడం ఒక్కొక్కసారి మెన్ పవర్ లేక ఇబ్బందిగా ఉంటుందని అన్నారు .

మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ మాట్లాడుతూ యోగ ద్వారా జీవిన విధానంలో మార్పులు వస్తాయని తద్వారా అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చునని అన్నారు . 2005 నుంచి ఖమ్మంలో యోగ నిర్వహిస్తున్న డాక్టర్ రామచందర్ రావు యోగ ఎందరికో స్ఫూర్తి నించిందని అన్నారు …డాక్టర్ రామచంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్నయోగ కార్యక్రమంలో అద్భుతంగా ఉందని ఆయన తెలిపారు యోగ కార్యక్రమంతో త్వరలో జర్నలిస్టులందరికి యోగ క్లాసులు నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తామని అన్నారు .. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ యోగ విద్యాలయం మాస్టారు కోదండరాం కార్యక్రమం నిర్వాహకులు కృష్ణమూర్తి వేణు అప్పారావు వెంకన్న సుమారు వందమంది యోగ సభ్యులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగ డేని భారత్ లో ఘనంగా నిర్వహించారు …ప్రధాని మోడీ ఏపీలోని విశాఖలో ఏర్పాటుచేసిన యోగ కార్యక్రమంలో పాల్గొననగా , దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ,రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు …

యోగా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ లో యోగా డే కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్,ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన గార్ల తో మరియు ఇతర అధికారులు ముఖ్య నేతలతో కలిసి పాల్గొనడం జరిగింది

Related posts

చెరువుమాదారంలో గోడకూలి దంపతుల మృతి…స్పందించిన పొంగులేటి, కుటుంబసభ్యులకు రూ లక్ష సహాయం…

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మంత్రి తుమ్మల కృతజ్ఞత లేఖ..యధాతధంగా…

Ram Narayana

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుంది …మంత్రి పొంగులేటి

Ram Narayana

Leave a Comment